కూటమి పాలనపై విసిగిపోయిన జనం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనపై విసిగిపోయిన జనం

Jan 1 2026 11:18 AM | Updated on Jan 1 2026 11:18 AM

కూటమి పాలనపై విసిగిపోయిన జనం

కూటమి పాలనపై విసిగిపోయిన జనం

వాల్మీకిపురం : కూటమి ప్రభుత్వం పంతొమ్మిది నెలల పాలనపై ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలో ప్రజలు మెచ్చిన సంక్షేమ పాలన సాగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అబద్దపు హామీలతో మోసం చేసి సీఎం పదవి చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి హరి, నాయకులు యల్లప్ప, రవి, వెంకటస్వామి, సుధాకర, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement