ఆటో అదుపు తప్పి డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో అదుపు తప్పి డ్రైవర్‌ మృతి

Jan 3 2026 7:04 AM | Updated on Jan 3 2026 7:04 AM

ఆటో అదుపు తప్పి డ్రైవర్‌ మృతి

ఆటో అదుపు తప్పి డ్రైవర్‌ మృతి

కలికిరి : ఆటో అదుపు తప్పి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వాల్మీకిపురం మండలం గండబోయనపల్లికి చెందిన షేక్‌ ఇంతియాజ్‌(35) ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పీలేరు మండలం ఒంటిల్లు వైపు నుంచి కలికిరికి ఆటో తోలుకుని వస్తుండగా పల్లెలవారిపల్లి వద్ద రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ ఇంతియాజ్‌ ఆటో కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య షెహనాజ్‌ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి నాలుగు సంవత్సరాలు వయస్సున్న కుమారుడున్నాడు.

జూదరుల అరెస్ట్‌

సాక్షి టాస్క్‌ఫోర్క్‌ : రామసముద్రం సమీపంలోని గుంతపేట వద్ద జూదరులను సీఐ రవినాయక్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు ఏఎస్‌ఐ హిమాచలపతి తెలిపారు. గురువారం రాత్రి గుంతల పేట సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బంది తో దాడి చేశామన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని, ఒకరు తప్పించుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.71వేలు నగదు, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే పేకాట ఆడుతున్న వారిలో ఏడు మంది ఉన్నారని, అందులో టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసులో నుంచి తప్పించి అరెస్ట్‌ చేయకుండా చేశారని తెలిసింది. అయితే ఇద్దరిని మాత్రం అరెస్ట్‌ చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రామసముద్రం మండలంలో పెద్ద పెద్ద నాయకుల అండతో నిత్యం పేకాట, కోడిపందేలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వారికి కొంతమంది కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహకరిస్తూ, ఉన్నతాధికారులు దాడులు చేయాలనుకున్నపుడు, పేకాట, కోడిపందెంరాయుళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ వారిని తప్పిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు సర్వం సిద్ధం

జమ్మలమడుగు/ జమ్మలమడుగు రూరల్‌ : ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు వాలీబాల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సెక్రెటరీలు ప్రసాద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న బాలికల జూనియర్‌ కాలేజిలో జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని శనివారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో ఆర్గనైజింగ్‌ కోఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈనెల 5వ తేదీ నుంచి జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభభమయ్యే వాలీబాల్‌ పోటీలకు దేశ వ్యాప్తంగా 30 టీంలు వస్తున్నాయని, అందులో కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి మూడు టీంలు, బోర్డు స్కూల్స్‌ నుంచి 7, అలాగే 20 రాష్ట్రాలనుంచి వాలీబాల్‌ టీంలు వస్తున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement