రేస్‌ కాలేజీని పరిశీలించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

రేస్‌ కాలేజీని పరిశీలించిన ఎస్పీ

Jan 4 2026 7:08 AM | Updated on Jan 4 2026 7:08 AM

రేస్‌

రేస్‌ కాలేజీని పరిశీలించిన ఎస్పీ

మదనపల్లె రూరల్‌ : పట్టణంలోని బెంగళూరురోడ్డు రుక్మిణిదేవి అరండల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (రేస్‌) కాలేజీని జిల్లా ఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, రేస్‌ కాలేజీని సందర్శించి, శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు. సత్వరమే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కాలేజీ ముందు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయం బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర, వన్‌టౌన్‌ సీఐ మహమ్మద్‌ రఫీ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట సమీపంలో ఉన్న యం.పార్లపల్లి మిట్ట వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తుమ్మరకుంట పంచాయతీ బొమ్మకపల్లికి చెందిన వెంకటేష్‌ (46), అభిషేక్‌ (22) గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బి.కొత్తకోట సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

రాజంపేటలో చైన్‌స్నాచింగ్‌

రాజంపేట : పట్టణంలోని నూనివారిపల్లెలో బీవీఎన్‌ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద శనివారం నీలపూజి జ్యోతి అనే మహిళ మెడలో నుంచి దుండగుడు సరుడు లాక్కొ వెళ్లాడు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరుడు రోల్డ్‌గోల్డ్‌ అయినప్పటికి అందులో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు పుస్తెలు ఉన్నాయని బాధితురాలు తెలిపారు. పల్సర్‌బైక్‌పై వచ్చిన దుండగుడు చైన్‌ను గట్టిగా లాగడంతో మహిళ మెడకు గాయమైంది. థైరాయిడ్‌ కారణంగా ఇటీవలే ఆమె గొంతుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రేస్‌ కాలేజీని పరిశీలించిన ఎస్పీ   1
1/1

రేస్‌ కాలేజీని పరిశీలించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement