ఆస్కార్‌ ఫుడ్‌ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం.. | The 70-Dish Oscars 2026 After-Party Full Menu | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ ఫుడ్‌ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..

Mar 16 2026 12:01 PM | Updated on Mar 16 2026 1:09 PM

The 70-Dish Oscars 2026 After-Party Full Menu

సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్‌ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. మరి ఈ వేడుకకు వచ్చే అతిరథ మహారథులకు ఆస్కార అవార్డుల అనంతరం జరిగే విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, సెలబ్రిటీల కోసం ప్రత్యేక మెనూతో కూడిన వంటకాలను సర్వ్‌ చేయనున్నారు. ఈసారి ఆస్కార్‌ వేడుక అనంతరం జరిగే పార్టీలో ఏం వంటకాలు ఉన్నాయో చూద్దామా..!.

ప్రఖ్యాత చెఫ్‌ రెస్టారెంట్‌ వ్యాపారి వుల్ఫ్‌గ్యాంగ్‌ పుక్‌ ఈ ఆసార్క్‌ వేడుకకు వచ్చే అతిథులు తీవ్రమైన ఆకలితో ఉంటారని అందుకే పిజ్జా వంటి కంఫర్ట్‌ ఫుడ్‌(మనసుకు హాయినిచ్చే ఆహారం)ని ఇష్టపడతారని చెబుతున్నారు. ఈసారి  విందుని  75 మంది ప్రధాన చెఫ్‌లు (savoury chefs), 45 మంది పేస్ట్రీ చెఫ్‌లు, 325 మంది సేవా సిబ్బంది, నిర్వాహకులు కలిసి తయారు చేస్తారని అన్నారు. ఈ ఏడాది హాలీవుడ్‌ ప్రముఖులకు వడ్డించే వంటకాల మెనూలో ఏం ఉన్నాయంటే..

ఇలా ఆస్కార్‌ అతిథులకు రుచికరమైన ఆహారం వడ్డించడం అనేది పుక్‌ బృందానికి వరుసగా ఇది 32వ సంవత్సరం కావడం విశేషం. అందుకే ఈసారి 70కి పైగా వంటకాలు వడ్డించామని తెలిపారు పుక్‌. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మార్పులు చేర్పులు ఏమిటంటే: జపనీస్ శైలి పబ్ ఆహారాన్ని అందించే 'live izakaya station',  అప్పుడే తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ను వడ్డించే ఇటాలియన్ 'gelato machine' వంటివి హైలెట్‌గా నిలవనున్నాయి.

ఈ ఏడాది మెనూలో 600 హోం మేడ్‌ పిజ్జాలు, 'artichoke agnolotti' అనేది ఇటాలియన్ పాస్తా మాదిరి శాకాహార వంటకం, బంగారు పొడితో అలంకరించిన రెండు వేల చిన్న చాక్లెట్‌ ఆస్కార్‌ విగ్రహాలు. ఈ చాక్లెట్‌ ఆస్కార్‌ విగ్రహాలపై రెండు గ్యాలన్ల 24-క్యారెట్ల 'ద్రవ బంగారం' వినియోగిస్తారట. మొత్తం 1500 మంది వంట చేసి సర్వ్‌ చేస్తారట. వంటకాలన్ని చాలా లైట్‌వైట్‌గా తయారు చేస్తారు. అలాగే ఈ వంటకాల కోసం ఇబ్బడిముబ్బడిగా సాస్‌లను వినియోగించరట. 

ముఖ్యంగా వంటల్లో అన్ని నాణ్యమైన దినుసులనే వినియోగిస్తారట. వాటిలో దాదాపు 91 కిలోల డ్రై-ఏజ్డ్ రిబే, 136 కిలోల హౌస్-స్మోక్డ్ సాల్మన్, 14 కిలోల కలుగా కేవియర్, 227 కిలోల వైల్డ్ మష్రూమ్‌లు, 91 కిలోల నిషికి రైస్, 181 కిలోల చీజ్‌లు తదితరాలు ఉంటాయి. ఈ ఏడాది ఆస్కార్‌ వంటకాలు సర్వ్‌ చేసే మెనూ పేరు వచ్చేసి ఎలిగాన్స్ అండ్ కంఫర్ట్ కంబైన్. 

అలాగే కొత్తవంటకాల ప్రయోగాలను పరిచయం చేయరట. ఎందుకంటే అవి అందరికీ పడకపోవచ్చు..ఏదైన హెల్త్‌ సమస్యలు ఉత్ఫన్నమయ్యే అవకాశం ఉండొచ్చు. అంతేకాదండోయ్‌ విందుతోపాటు మందు కూడా ఉంది. ఏకంగా 1700 షాంపైన్‌ బాటిళ్లు అతిథులకు సర్వ్‌ చేస్తారట. అలాగే ఈ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్న నిరాశ్రయ ప్రజలకు పంపిణీ చేస్తారట.  

(చదవండి: మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్‌..! 18 దేశాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement