నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..! | Alia Bhatt said Some life lessons my cats have taught me | Sakshi
Sakshi News home page

నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..!

Feb 13 2026 12:06 PM | Updated on Feb 13 2026 12:21 PM

 Alia Bhatt said Some life lessons my cats have taught me

బాలీవుడ్‌ నటి, రణబీర్‌ కపూర్‌ భార్య ఆలియా భట్‌ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్‌ పరంగానూ ఆమెకు సాటిలేరవ్వరూ. రెట్రో స్టైల్‌తో అందర్నీ మెప్పించి..అందరూ ఆ బాటలో పయనించేలా స్ఫూర్తిగా నిలిచిందామె. అలాంటి ఆలియా ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకెంతో ఇష్టమైన పిల్లుల నుంచి గొప్ప జీవిత పాఠాలు నేర్చుకున్నానంటూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

ఆలియాకు తన పెంపుడు జంతువులు ఎడ్వర్డ్‌, జునిపర్‌లంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో తరుచుగా షేర్‌ చేస్తుంటుంది ఆలియా. అవి తనకు అద్భుతమైన జీవిత పాఠాలు నేర్పించాయంటూ వాటి గురించి చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అవేంటంటే..మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి, అలాగే ఎవరి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. 

ఎంత తక్కువగా ఆశ పెట్టుకుంటే అంత తక్కువగానే నిరాశే చెందుతామని అంటోందామె. హాయిగా నిద్రపోండి. జీవితం చాలా అందమైనది అంటూ ఆమె తన పెంపుడు పిల్లుల నుంచి నేర్చుకున్న వాటి గురించి వివరించింది. అలాగే తన చిన్నతనాన్ని ఉద్దేశించి ఒక హృదయపూర్వక లేఖను పంచుకుంది. బాల్య స్వభావం ప్రకారం..చిన్నారులు ఎక్కువ కలలు కంటుంటారు. ఆ లేఖలో దాన్నే ప్రోత్సహిస్తూ..చిన్నా నువ్వు ఎప్పుడు కలలు కంటూనే ఉంటావని తెలుసు. దయచేసి అలా చేయడం ఆపకండి. మీలోని కలలు కనేవాడే మీ సూపర్‌ పవర్‌ అంటూ చెప్పిన మాట కూడా తనకు అద్భుతంగా పనిచేసిందని అంటోంది ఆలియా. 

ఇక, ఆలియా తన కుమార్తె రాహా గురించి మాట్లాడుతూ..మనకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన కూమార్తె పుడుతుంది. మన జీవితం ఊహించలేని విధంగా మారుతుంది. పైగా ఆమె న్యాయవాది ఆకావాలని అనుకుంటుంది కూడా అని నవ్వుతూ అన్నారామె. కాగా, ఏప్రిల్ 14, 2022న పెళ్లి బంధంతో ఆలియా, రణబీర్‌ కపూర్‌లు ఒక్కటయ్యారు.

 

(చదవండి: శెభాష్‌ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement