సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..! | Fitness coach shares traditional Tamil diet for 22 kg weight loss | Sakshi
Sakshi News home page

weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!

Feb 8 2026 3:03 PM | Updated on Feb 8 2026 3:15 PM

Fitness coach shares traditional Tamil diet for 22 kg weight loss

వెయిట్‌లాస్‌ కోసం ఎన్నో రకాల డైట్‌లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్‌గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్‌నెస్‌కోచ్‌ కాగివన్‌ ప్రభాహరణ్‌. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్‌ప్యాక్‌ శరీరంతో స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్‌కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్‌లాస్‌ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్‌ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివరించాడు.

తమిళులు చాలామంది సిక్స్‌ ప్యాక్‌ కోసం డైట్‌ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్‌ ప్యాక్‌ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్‌లాస్‌ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్‌గా తింటే చాలట. 

వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్‌ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు.   

ఆ మూడు తప్పనిసరి..
సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్‌​ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్‌లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్‌ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్‌, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. 

ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్‌ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్‌నెస్‌ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్‌లాస్‌కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా  ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్‌ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్‌లాస్‌ అవుతామని చెబుతున్నాడు కాగివన్‌

 

(చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement