మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే విస్తుపోతారు! | Kiara Advani looks pretty in pink Masaba saree worth Rs 1.3 lakh | Sakshi
Sakshi News home page

మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే విస్తుపోతారు!

Apr 5 2026 11:56 AM | Updated on Apr 6 2026 10:13 AM

Kiara Advani looks pretty in pink Masaba saree worth Rs 1.3 lakh

ఫ్యాషన్‌ ఐకాన్‌గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్‌ స్టైలే వేరేలెవెల్‌. ధరించే డిజైనర్‌ వేర్‌ నుంచి ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగ్‌ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్‌ షూట్‌ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్‌ లుక్స్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. 

ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్‌తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్‌తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్‌గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్‌వర్క్‌ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 

పాంఖ్‌ బాగ్‌, గుల్‌ఝురోఖా మెటిఫ్‌లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్‌ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్‌ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్‌మెంట్ మహారాణి-శైలి నెక్లెస్‌ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్‌ని పొరలు పొరలుగా డిజైన్‌ చేశారు. 

ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్‌ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్‌ మ్యాకప్‌తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్‌ రంగు హెర్మెస్‌ మినీ కెల్లి పోచెట్‌ బ్యాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. 

(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..!)
 

Advertisement
 
Advertisement
Advertisement