నాటక రంగాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

నాటక రంగాన్ని కాపాడుకుందాం

Dec 29 2025 8:46 AM | Updated on Dec 29 2025 8:46 AM

నాటక

నాటక రంగాన్ని కాపాడుకుందాం

హొసపేటె: ఆధునిక యుగంలో నాటక రంగాన్ని కాపాడుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌.ఎన్‌.టి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం రాత్రి సులదహళ్లిలోని కందగల్లు హనుమంతరాయ కళా సంఘం, కూడ్లిగి తాలూకా బలగ ఆధ్వర్యంలో రక్తరాత్రి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జాతరలు, పండుగలు సహా వివిధ సందర్భాల్లో పౌరాణిక, జానపద నాటకాలను తరచుగా ప్రదర్శించే వారని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా ప్రభావం అధికం కావడంతో కళలు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినోదాన్ని అందించే నాటకాలను అందరూ ఆదరించాలని సూచించారు. అనంతరం సీనియర్‌ రంగస్థల కళాకారులు ఎస్‌.అంజినమ్మ, కే.నాగరత్న, బి.గంగమ్మ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ తాపా అధ్యక్షుడు బెన్నె కోట్రేష్‌, ఖానవలి కొట్రేశప్ప సూలదహళ్లి రాఘవేంద్ర, తిప్పేస్వామి తదితరులు కళాకారులు పాల్గొన్నారు.

టీబీ డ్యామ్‌ గేట్ల

ఏర్పాటు పనుల పరిశీలన

హొసపేటె: తుంగభద్ర జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి, తుంగభద్ర బోర్డు సభ్యుడు నరసింహ మూర్తి ఆదివారం సందర్శించారు. కొత్త గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభమైన కొత్త గేట్ల ఏర్పాటు పనులపై ఆరా తీశారు. 18 క్రస్ట్‌ గేట్‌ను 12 భాగాలుగా ఏర్పాటు చేస్తుండగా.. ఈ జలాశయం 33 క్రస్ట్‌ గేట్లను భర్తీ చేయడానికి నిపుణులు నివేదిక ఇచ్చారు. గేట్ల భర్తీ పని గుజరాత్‌లో జరుగుతోంది. గేట్ల భర్తీ పనిని అసలు హార్డ్‌వేర్‌ టూల్స్‌, మెషినరీ ప్రాజెక్ట్‌ కంపెనీకి ఇచ్చారు. ఈ సంస్థ ఇప్పటికే 15 కొత్త గేట్లను నిర్మించింది. తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ నారాయణ నాయక్‌, ఈఈ చంద్రశేఖర్‌ ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కొత్త గేట్‌ నిర్మాణం పురోగతిని వివరించారు.

డాక్టర్‌ మునిస్వామికి

గౌరవ డాక్టరేట్‌

బళ్లారి అర్బన్‌: బళ్లారి తాలూకా కప్పగల్‌ గ్రామానికి చెందిన కన్నడ రక్షణ యువ వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సి.మునిస్వామికి ఢిల్లీ నేషనల్‌ యూనివర్సిటిలో రాజస్థాన్‌ గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రా, యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ గౌరవ డాక్టరేట్‌ అందజేశారు. మునిస్వామి 2007 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,600 జంటలకు ఉచిత వివాహాలు చేయించారు. గతంలో ప్రతి మౌలిక సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల కోసం కన్నడ రక్షణ యువ వేదిక నుంచి వినతిపత్రాలు అందించి పోరాటాలు చేశారు. 20 ఏళ్లుగా ఆరోగ్య ఉచిత శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ తదితర సేవలు కొనసాగిస్తున్నారు. సమాజ సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని మునిస్వామి తెలిపారు.

కార్మికుల సమస్యలపై అధ్యయనం

కోలారు: కార్మికుల సమస్యలను అధ్యయనం చేయడానికి కోలార్‌ జిల్లా పర్యటనకు వచ్చినట్లు రాష్ట్ర కనిష్ట వేతన మండలి అధ్యక్షుడు టీఎం.షాహిల్‌ టెక్కిల్‌ తెలిపారు. నగరంలోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల రక్షణకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సీఎం సిద్ధ రామయ్య, కార్మికశాఖ మంత్రి అనిల్‌లా కార్మికుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మూడు కోట్ల మంది కార్మికులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని, నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడి హితవును కాపాడడానికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నాటక రంగాన్ని కాపాడుకుందాం 1
1/2

నాటక రంగాన్ని కాపాడుకుందాం

నాటక రంగాన్ని కాపాడుకుందాం 2
2/2

నాటక రంగాన్ని కాపాడుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement