వినియోగదారులకు హక్కులపై అవగాహన అవసరం
హొసపేటె: దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, మోసాలను నిరోధించడానికి, భారతీయ న్యాయ వ్యవస్థలో వినియోగదారులకు అనేక హక్కులు ఉన్నాయని, ప్రతి వినియోగదారుడు వాటి గురించి తెలుసుకోవడం అవసరమని హొసపేటె లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రహ్మణ్య తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారుల రక్షణ చట్టం–1986 వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి రూపొందించిన మొదటి బలమైన చట్టం అన్నారు. ఈ చట్టంలో మూడు అంచెల న్యాయ వ్యవస్థ ఉంది. ఇక్కడ వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసి జిల్లా వినియోగదారుల ఫోరం నుంచి రూ.1 కోటి వరకు, రాష్ట్ర వినియోదారుల ఫోరం నుంచి రూ.10 కోట్ల వరకు ఉపశమనం పొందవచ్చన్నారు. వస్తువులు, సేవలలో రూ.10 కోట్లకు పైగా మోసం జరిగితే, వారు ఫిర్యాదులు దాఖలు చేసి ఫోరంల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ చట్టం వినియోగదారులకు ఆరు ప్రాథమిక హక్కులను అందిస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ లావాదేవీల్లో మోసం జరిగితే వినియోగదారులు వినియోగదారుల రక్షణ చట్టం–2019 కింద ఫిర్యాదు చేయవచ్చన్నారు. విత్తనాలు, ఎరువులు వంటి ఇతర వస్తువులలో మోసపోతే రైతులు వినియోగదారుల ఫోరంలో కూడా ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని తెలిపారు.
న్యాయమూర్తి సుబ్రహ్మణ్య


