తృణధాన్యాలతో అధిక ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

తృణధాన్యాలతో అధిక ప్రయోజనాలు

Jan 1 2026 11:28 AM | Updated on Jan 1 2026 11:28 AM

తృణధా

తృణధాన్యాలతో అధిక ప్రయోజనాలు

హొసపేటె: మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలతో పోలిస్తే తృణధాన్యాలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని జిల్లాధికారి కవిత ఎస్‌.మన్నికేరి తెలిపారు. నగరంలోని వ్యవసాయ సంయుక్త డైరెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి తృణధాన్యాలు, మరచిపోయిన వంటకాల వంటల పోటీలను ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తృణధాన్యాల వాడకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలన్నారు. శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డీటీ.మంజునాథ్‌ మాట్లాడుతూ ఇతర పంటలతో పోలిస్తే, తృణధాన్యాల పంటలకు తక్కువ నీరు అవసరం. ఈ తృణధాన్యాల మొలకలు, తెగుళ్ల ఉధృతి, తీవ్రమైన వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇతర పంటల కంటే పర్యావరణ అనుకూలమైనవని తెలిపారు. ఇద్దరు పురుషులు సహా మొత్తం 40 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాగి గంజి, సజ్జ రొట్టెలు, ఓళిగలు తదితర రుచికరమైన వంటకాలను ప్రదర్శనల్లో ఉంచారు.

తృణధాన్యాలతో అధిక ప్రయోజనాలు1
1/1

తృణధాన్యాలతో అధిక ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement