ఘనంగా బ్రెయిలీ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

Jan 5 2026 7:38 AM | Updated on Jan 5 2026 7:38 AM

ఘనంగా

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

రాయచూరు రూరల్‌: బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్‌ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఘనంగా నిర్వమించారు. నగరంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్‌ అన్వరి వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రెయిలీ దినోత్సవం జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధులకు బ్రెయిలీ లిపి వరంగా మారందని పలువురు కొనియాడారు. బ్రెయిలీ లిపితో ఎంతో మంది చూపులేని వారు చదువుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, ఆంజనేయ, శాంత, లక్ష్మీకాంత రెడ్డి, యత్నళ్లి, విమల, రంజిత తదితరులు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలి

రాయచూరు రూరల్‌: సధృడ సమాజ నిర్మాణం కోసం మహిళలు ముందడుగు వేయాలని ీసీనియర్‌ సాహితీవేత్త జయలక్ష్మి మంగళమూర్తి పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భనవంలో మహిళ పరిషత్‌ వేదికను జ్యోతి వెలిగించి మాట్లాడారు. వివేకవంతమైన చింతన, మౌల్యాలతో కూడిన సమాజం అభివృద్ధికి పూరకంగా ఉంటుందన్నారు. మహిళలు హక్కులు, విధులు, సమానత్వంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పర్వ మంగళ సక్రి,అణ్ణప్ప మేటి, యశోద, శరణమ్మ, శీలాదాస్‌, ఈరమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

పేదల పెన్నిధి ఈరణ్ణ

రాయచూరు రూరల్‌: నగర సభ మాజీ అధ్యక్షుడు ఎం.ఈరణ్ణ విశేష సేవలిందించి పేదల పెన్నిధిగా నిలిచారని కిల్లే బ్రహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు కొనియాడారు. ఆదివారం శశిమహల్‌ సర్కిల్‌ వద్ద ఈరణ్ణ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరణ్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడిగా, సమాజ సేవకుడిగా ఈరణ్ణ అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ అధ్యక్షురాలు పద్మావతి, నగర సభ సభ్యుడు పవన్‌ కుమార్‌, రేణుకాచార్య, రఘు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాల కూల్చివేత

హుబ్లీ: దావణగెరె ఎస్‌ఓజీ కాలనీలో పాలికె స్థలంలో నిర్మించిన ప్రైవేట్‌ పాఠశాలను ఆదివారం తహసీల్దార్‌, పాలికె కమిషనర్‌ సమక్షంలో కూల్చివేశారు. విద్యా సంవత్సరం ముగిసేదాక కూల్చొద్దని పాఠశాల యజమాన్యం సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విద్యార్థులను బయటకు పంపించి కట్టడాన్ని కూల్చి వేశారు. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్‌ అధ్యక్షుడు శశికాంత కోసంబే మాట్లాడుతూ.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పాలికె అధికారులకు నోటీసులు జారీ చేశారు. పాలికె కమిషనర్‌ ఇచ్చే సమాదానాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాలికె కమిషనర్‌ స్పందిస్తూ.. పాఠశాల కట్టడం పాలికె స్థలంలో ఉండటంతో పాఠశాలను తరలించాలని యాజమాన్యానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. దీంతో కట్టడాన్ని కూల్చి వేశామన్నారు. ఈ స్థలాన్ని నిరాశ్రయులకు అందజేస్తామన్నారు.

మంత్రాలయంలో

సిద్ధగంగ పీఠాధిపతి

రాయచూరు రూరల్‌: తుమకూరు సిద్ధగంగ మఠం పీఠాధిపతి సిద్ధలింగ స్వామి ఆదివారం మంత్రాలయంలో పర్యటించారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల సేవలు జరిపారు. మఠం అధికారులు మంచాలమ్మ దేవి దర్శనం చేయించారు.

ఘనంగా  బ్రెయిలీ దినోత్సవం1
1/4

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

ఘనంగా  బ్రెయిలీ దినోత్సవం2
2/4

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

ఘనంగా  బ్రెయిలీ దినోత్సవం3
3/4

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

ఘనంగా  బ్రెయిలీ దినోత్సవం4
4/4

ఘనంగా బ్రెయిలీ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement