కొత్త మొక్కులు ! | - | Sakshi
Sakshi News home page

కొత్త మొక్కులు !

Jan 2 2026 11:07 AM | Updated on Jan 2 2026 11:07 AM

కొత్త

కొత్త మొక్కులు !

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలకు గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద బారులు దీరగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, ఏపీలోని వివి ధ ప్రాంతాల భక్తులు రావడంతో కిటకిటలా డింది. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయం, వాహన పూజలు, తలనీలాల టికెట్ల ద్వారా ఒకే రోజు ఆలయానికి రూ.5,05,900 ఆదాయం సమకూరింది. జమలాపురం సర్పంచ్‌ తుళ్లూరు నిర్మల–కోటేశ్వరరావు భక్తులకు ప్రసాద వితరణ చేయగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ఉప్పల విజయదేవశర్మ ప్రమాణ స్వీకారం చేశా రు. ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల రాజీవ్‌శర్మ, ఎస్‌ఐ రమేష్‌, ఉద్యోగులు సోమ య్య, ముల్పూరి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఎర్రుపాలెం/సాక్షి నెట్‌వర్క్‌

కొత్త మొక్కులు !1
1/1

కొత్త మొక్కులు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement