వైద్యులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు సమయపాలన పాటించాలి

Jan 4 2026 7:05 AM | Updated on Jan 4 2026 7:05 AM

వైద్యులు సమయపాలన పాటించాలి

వైద్యులు సమయపాలన పాటించాలి

మంచిర్యాలటౌన్‌: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికా రి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలను ఎప్పటికప్పుడు సరిచూసుకుని, తెప్పించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలి పారు. కుక్క, పాముకాటు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శివప్రతాప్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement