Aadi Pinishetty-Nikki Galrani Marriage: వారం రోజుల్లోనే ఆది-నిక్కీల వివాహం, ఆ రోజే ఫిక్స్‌

Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed - Sakshi

Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్‌ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్‌.

చదవండి: అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది: డైరెక్టర్‌ పరశురాం 

అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్‌ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్‌ చేస్తారా? లేక ఎంగేజ్‌మెంట్‌ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే.

చదవండి: అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది: డైరెక్టర్‌ పరశురాం 

‘యాగవరైనమ్‌ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్‌ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి.  ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్‌ లక్‌ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్‌ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్‌లో ప్రతి కథానాయకుడిగా నటించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top