-
వరుణ్–లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే ???
-
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా?
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు డేట్ ఫిక్సయ్యిందా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) మెగాఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలున్నారు. వాళ్లందరిలో సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'గాండీవధారి అర్జున' అనే క్లాస్ యాక్షన్ చేస్తున్నాడు. ఇది ఆగస్టు 25న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న వరుణ్-లావణ్య ఈ మధ్యే కాఫీ డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో స్టోరీస్‌గా పెట్టారు. జూన్‌లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే.. ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏకంగా డేట్ ఇదేనంటూ ఒకటి బయటకొచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టేశారని సమాచారం. అయితే సినిమా రిలీజ్ పెట్టుకుని వరుణ్.. ఆగస్టులో మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా ఇదే జస్ట్ రూమర్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్ చేస్తారా? లేక ఎంగేజ్మెంట్ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్లో ప్రతి కథానాయకుడిగా నటించాడు. -
పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్! కారణం ఇదేనా?
Alia Bhatt, Ranbir Kapoor Wedding Date Postponed: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్ సెలబ్రెటీలు వీరేనని, అందులో దీపికా పదుకొనె కూడా ఉందంటూ బీ-టౌన్లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇక వధువరులు ధరించే పెళ్లి బట్టలు, నగలు దగ్గరి నుంచి వీరి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మహెందీ, హల్దీ వేడుకలు జరగనుండగా.. ఏప్రిల్ 14 లేదా 15వ తేదీల్లో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర అయితే వీరి పెళ్లి తేదీపై మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అంతేకాదు ఈ వార్తలపై ఇప్పటికీ ఈ జంట కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. ఈ క్రమంలో ఈ లవ్‌బర్డ్స్ తమ పెళ్లి తేదీని వాయిదా వేసుకుందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటీకి ఎలాగోలా అది బయటకు వచ్చిది. అంతేకాదు పెళ్లి ముహుర్తం నుంచి అరెంజ్మెంట్స్ వరకు అన్ని మీడియా చెవిన పడ్డాయట. దీంతో ఇరు కుటుంబాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని, అలాగే సెక్యురిటీ దృష్ట్యా కూడా పెళ్లి తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చదవండి: పెద్దపల్లి జిల్లాగోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్ స్వయంగా ఈ కొత్త పెళ్లి తేదీపై అలియా కజిన్(స్టెప్ బ్రదర్) రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాహుల్ అలియా-రణ్‌బీర్ పెళ్లి విషయంపై స్పందించాడు. ‘నిజానికి వీరి పెళ్లి ఏప్రిల్ 14, 15 తేదీలలో జరపాలని అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెళ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఏప్రిల్ 20వ తేదీన జరిగే అవకాశం ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు. -
ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం!
Katrina Kaif And Vicky Kaushal Marriage Date: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్‌ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించిన అప్డేట్స్ను కూడా ఈ జంట సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్లో ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? తాజా వీరి వివాహని ముహుర్తం కూడా ఖరారైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట వివాహ మహోత్సవ వేడుకను జరనుందని బి-టౌన్ జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రోజే విక్కీ-కత్రినా పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కత్రినా కైఫ్ సన్నిహితులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో జరిగే వీరి వివాహ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుక జరగనున్నాయట. ఇక 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలు, సెలబ్రెటీలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! వెడ్డింగ్‌కు 200 మంది అతిధులు హాజరు కానున్నారని కూడా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవరు మొబైల్స్ తీసుకురావొద్దనే కండీషన్ పెట్టారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే వివాహానికి జైపూర్ పయనమయ్యే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement