దుబాయ్‌కి వెళ్తున్న మహేశ్‌.. 20 రోజులు అక్కడే! | Mahesh Babu Flying To Dubai For Sarkaru Vaari Paata Shooting | Sakshi
Sakshi News home page

దుబాయ్‌కి వెళ్తున్న మహేశ్‌.. 20 రోజులు అక్కడే!

Jan 17 2021 6:04 PM | Updated on Jan 17 2021 9:41 PM

Mahesh Babu Flying To Dubai For Sarkaru Vaari Paata Shooting - Sakshi

వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి..

దుబాయ్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నారు మహేశ్‌బాబు. ఫ్యామిలీతో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌ వెళ్తారు కదా.. ఈ ప్రయాణం అది కాదు. ‘సర్కారువారి పాట’ షూటింగ్‌ కోసమే దుబాయ్‌ వెళ్తున్నారట. పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఈ నెకాఖరున దుబాయ్‌లో ఆరంబించాలనుకుంటున్నారని తెలిసింది. అక్కడ ఇరవై రోజుల పాటు చిత్రీకరణ జరిపి, హైదరాబాద్‌ వస్తారట. అనంతరం ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. 
(చదవండి : మహేశ్‌ బాబు అందానికి సీక్రెట్‌ అదే : విష్ణు)

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్‌ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement