మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు! నటికి ఆఫర్‌ | Malaysian Actress Rejected Offer to become VVIP 3rd Wife with Rs 11 lakh Monthly Allowance | Sakshi
Sakshi News home page

'నన్ను పెళ్లి చేసుకో.. 10 ఎకరాలు, లక్షలాది డబ్బు నీదే'.. నటి ఆన్సరిదే!

Jan 2 2026 1:32 PM | Updated on Jan 2 2026 1:40 PM

Malaysian Actress Rejected Offer to become VVIP 3rd Wife with Rs 11 lakh Monthly Allowance

సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని కొందరు వెంటపడుతుంటారు. చాలామటుకు తారలు ఈ ప్రపోజల్స్‌ చూసి ఓ నవ్వు నవ్వి వదిలేస్తారు. కొందరు మాత్రం అందులోని తీవ్రతను, పిచ్చిని సోషల్‌ మీడియా వేదికగా ఎండగడతారు. తాజాగా మలేషియాకు చెందిన ఓ నటి, మోడల్‌కు కూడా వింత ప్రపోజల్‌ వచ్చిందట!

వింత ప్రపోజల్‌
29 ఏళ్ల మోడల్‌ అమీ నుర్‌ టినీ ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనకు వీవీఐపీ (అత్యంత ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి/ప్రముఖుడు) నుంచి ఓ ప్రపోజల్‌ వచ్చిందని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'అతడికి మూడో భార్యగా ఉంటే నాకు ఓ బంగ్లా, లగ్జరీ కారు, పది ఎకరాల స్థలం రాసిస్తానన్నాడు. అంతేకాకుండా నా ఖర్చుల కోసం నెలకు రూ.11 లక్షలు ఇస్తానన్నాడు. 

మూడో భార్యగా ఉండమని..
అతడి మాటలు విని షాకయ్యా.. ఈ ఆఫర్‌ తిరస్కరించాను. నేను కార్పొరేట్‌ ఈవెంట్స్‌కు యాంకరింగ్‌ కూడా చేస్తుంటాను. ఆ సమయంలో కొందరు ప్రముఖులు నా ఫోన్‌ నెంబర్‌ అడుగుతారు, ఇంటికి రమ్మని పిలుస్తారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన మూడో భార్యగా ఉండమని కోరాడు. అతడికి దాదాపు నా తండ్రి వయసు ఉంటుంది. అతడి  పిచ్చి ప్రపోజల్‌కు నేను వెంటనే నో చెప్పేశా' అని చెప్పుకొచ్చింది.

అమ్మ కౌంటర్‌
గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి అమీ ప్రస్తావించింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు అతడు సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. కాకపోతే పెళ్లి చేసుకోమని షరతు పెట్టాడు. అప్పుడు మా అమ్మ ఒక్కటే సమాధానమిచ్చింది.. నేను నా కూతుర్ని అమ్మదల్చుకోలేదని గట్టిగా బదులిచ్చింది అని పేర్కొంది.

చదవండి: బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన సు ఫ్రమ్‌ సో నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement