ముక్కలైనా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. టాలీవుడ్ నటి ఎమోషనల్ పోస్ట్ | Tollywood actress Hamsa Nandini emotional post on womens day | Sakshi
Sakshi News home page

Hamsa Nandini: ముక్కలైనా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. హంసానందని ఎమోషనల్ పోస్ట్

Mar 9 2026 10:49 AM | Updated on Mar 9 2026 10:59 AM

Tollywood actress Hamsa Nandini emotional post on womens day

టాలీవుడ్‌ అభిమానులను అలరించిన నటీమణుల్లో హంసానందిని ఒకరు. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.

తాజాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన జీవితం ముక్కలైనా.. మళ్లీ నిర్మించుకున్నానని తెలిపింది. క్యాన్సర్‌తో పోరాడి  తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్న ప్రయాణం గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తన లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను తలచుకుని ఎమోషనలైంది.

క‍్యాన్సర్ బారిన పడి..

అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ తర్వాత 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement