దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు! | Man ties wife to chair burns her alive on suspicion of affair | Sakshi
Sakshi News home page

దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు!

Nov 5 2026 3:56 PM | Updated on Nov 5 2026 4:11 PM

Man ties wife to chair burns her alive on suspicion of affair

ఉత్తర ప్రదేశ్‌లోని  ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో, ఆమెను కుర్చీకి కట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. అనంతరం పిల్లలతో కలిసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఛిబ్రామౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మృతురాలిని 30 ఏళ్ల సోనమ్‌గా గుర్తించారు.

పోలీసుల సమాచారం  ప్రకారం నిందితుడు సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోను2015లో  11 ఏళ్ల క్రితం  సోనమ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.  ఆర్థిక ఇబ్బందుల కారణంగా, కుటుంబాన్ని పోషించుకునేందుకు హర్యానాలోని హిసార్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా  ఇటీవల అతను తిరిగి తన స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయమై ఆమెతో వాగ్వాదం జరిగింది. నవంబర్ 5వ తేదీ ఉదయం, అతను తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి, కొద్దిసేపటి తర్వాత ఒక సీసాలో పెట్రోల్ తెచ్చి  భార్యపై పోసి నిప్పంటించాడు. ఈ తర్వాత, భార్యను గదిలో బంధించి పారిపోయాడు. భారీగా చెలరేగడంతో ఆమె సజీవ దహనమైంది.

సోనమ్‌ కేకలు విన్న స్థానికులు ప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. పోలీస్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు సుఖ్‌బీర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : డాగ్‌ ఎటాక్‌ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!

పెద్దల సమక్షంలో పంచాయతీ 
ఇటీవల ఒంటికి వచ్చిన  సుఖ్‌బీర్‌కు భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం ముదరడంతో, గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఇకపై ఆ యువకుడితో మాట్లాడబోనని సోనమ్ అంగీకరించింది. భర్తతోనే కలిసి ఉంటానని కూడా చెప్పింది. అయినా సుఖబీర్‌ అనుమానం తగ్గలేదు. భార్యతో మళ్లీ గొడవకు దిగిన సుఖ్‌బీర్‌ చివరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మరోవైపు  సోనమ్‌తో సంబంధం ఉందని సుఖబీర్‌ అనుమానించిన ఆ యువకుడు అదే రోజు విషం తాగాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఇది కదా సంబరాల దీపావళి ... సెలవులే సెలవులు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement