అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం | NRIs Have Grand Tribute to Late Singer Balu By his Songs | Sakshi
Sakshi News home page

అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

Published Mon, Jun 14 2021 8:08 PM | Last Updated on Mon, Jun 14 2021 8:47 PM

NRIs Have Grand Tribute to Late Singer Balu By his Songs - Sakshi

హ్యుస్టన్‌ (టెక్సాస్‌): గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం 75  వ జయంతి సందర్భంగా 75  పాటలతో ప్రవాస భారతీయులు అలరించారు. పది మంది గాయకులు నాటి నుంచి నేటి వరకు బాలు పాడిన పాటలను మనసారా ఆలపించి ఆ మహనీయుడి పాటకు పట్టాభిషేకం చేశారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా - తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ - శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

2021 జూన్‌ 13 ఆదివారం  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00  గంటలకు టెక్సాస్‌లోని  హ్యూస్టన్లో వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ గాయని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోష్ ఫిలిం న్యూస్., TRINET ,  తెలుగు కళాసమితి ఒమన్  ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.వీనుల విందైన ఈ కార్యక్రమానికి అతిధులుగా, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి , సురేష్ కొండేటి, ఒమన్ నుంచి హరి వేణుగోపాల్, వంశీ రామరాజులు హాజరయ్యారు.

 ఈ పాటల పట్టాభిషేకంలో  గాయకులు  రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం, శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్లు పాలు పంచుకున్నారు.   బాలు గొంతు నుంచి జాలువారిన అద్భుతమైన  75  పాటలను వీనులవిందుగా వినిపించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement