ఏనుగు దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఏనుగు దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి

Jan 3 2026 8:00 AM | Updated on Jan 3 2026 8:00 AM

ఏనుగు

ఏనుగు దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి

రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ సమితి నియమగిరి పర్వత ప్రాంతమైన బుడిని గ్రామానికి చెందిన బాల సికక (55) అనే వృద్ధుడు ఏనుగు దాడిలో తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ ఘటన గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. గాయాలపాలైన అతడిని బరంపురంలోని ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. 28 రోజులుగా చికిత్సలో ఉన్న బాల గురువారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించినప్పటికీ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకుని బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.

ఏనుగు దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి 1
1/1

ఏనుగు దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement