న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అసలు పోటీయే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఏ పార్టీకి వారు ఇవ్వలేదని గుర్తు చేశారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని అమిత్‍షా పేర్కొన్నారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ప్రధాని మోదీకే మరోసారి పట్టం గడతారని దీమా వ్యక్తం చేశారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, నాగలాండ్, మేఘాలయలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవడంపై అమిత్ షా సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుందన్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉండేదని గుర్తు చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
Comments
Please login to add a commentAdd a comment