సాక్షి, సిద్దిపేట: కొందరు ఏపీ మంత్రులు ఎగిరెగిరిపడుతున్నారని.. ఉన్నమాట అంటే.. వారు ఉలిక్కిపడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు.
‘ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ నాయకత్వం పోరాడతాం అన్నది. ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారు? విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు? పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదన్నాను. ఇందులో ఏమైనా తప్పుందా?. నేను ప్రజల పక్షాన మాట్లాడా. ఏపీ ప్రజలు, మంత్రుల గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు.
కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం
అత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది.
చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్
Comments
Please login to add a commentAdd a comment