
ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌లో అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు అవకాశం దక్కింది. వ్యక్తిగత కారణాలతో దూరమైన జేసన్ రాయ్ స్థానంలో టైటాన్స్ గుర్బాజ్‌ను అతని కనీస ధర రూ. 50 లక్షలకు తీసుకుంది. రషీద్, నూర్ అహ్మద్‌ల తర్వాత ఈ టీమ్‌లోకి ఎంపికైన మూడో అఫ్గాన్ క్రికెటర్ గుర్బాజ్. 2018 అండర్–19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన గుర్బాజ్ ఆడిన 9 వన్డేల్లోనే 3 సెంచరీలు చేశాడు.
కాగా వ్యక్తిగత కారణాలతో రాయ్ దూరం కావడంతో ఆ జట్టులో వృద్ధిమాన్ సాహాతో పాటు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా అందుబాటులో ఉన్నాడు. అయితే రాయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా గుర్బాజ్‌ను ఎంపిక చేయడంతో సాహాకు జట్టులో చోటు కష్టంగా మారనుంది. ఇదే జరిగితే టీమిండియా నుంచి దూరమైన సాహా.. ఐపీఎల్‌లో కూడా పేరుకు జట్టులో ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం రాకపోవచ్చు. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో తొలి మ్యాచ్ సీఎస్‌కే, కేకేఆర్ మధ్య జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment