Sakshi News home page

బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!

Published Tue, Mar 28 2023 8:08 AM

ICC Changed Indore Pitch Rating From Poor To Below Average-BCCI Appeal - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే ఐసీసీ బీసీసీఐ దెబ్బకు మాట మార్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో పిచ్‌కు ఐసీసీ పూర్‌ రేటింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఒప్పుకోని బీసీసీఐ అప్పీల్‌కు వెళ్లింది. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఇండోర్ పిచ్ రేటింగ్ను ఐసీసీ సవరించింది.

గతంలో ఇచ్చిన ‘పూర్’ రేటింగ్‌ని సవరించి ''బిలో యావరేజ్(Below Average)''గా మార్చింది. ఈ మేరకు ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హర్పర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇక​ ఇండోర్ టెస్టులో ఆసీస్ ప‌ది వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. పిచ్‌పై బంతి విపరీతంగా టర్న్ కావడంతో రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడ్డాయి. ఇందులో 25 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి.

దీంతో పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.  మూడో రోజు లంచ్ లోపే ఆట ముగియ‌డంతో మ్యాచ్ రిఫ‌రీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి రిపోర్ట్ పంపించాడు. అందులో.. ''పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాట‌ర్లకు, బౌల‌ర్లకు స‌మానంగా స‌హ‌క‌రించ‌లేదు. మొద‌టి నుంచే స్పిన్నర్లకు అనుకూలించింది'' అని తెలిపాడు. దాంతో ఇండోర్‌ పిచ్ ‘అధ్వానం’గా ఉందని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. 

చదవండి: చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే

ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్‌

Advertisement

What’s your opinion

Advertisement