జో రూట్.. ఈతరంలో గొప్ప టెస్టు క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. కెప్టెన్‌గా ఎన్నో టెస్టుల్లో ఇంగ్లండ్‌కు విజయాలు అందించాడు. టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన రూట్ ఖాతాలో 28 సెంచరీలు ఉన్నాయి. మధ్యలో ఇంగ్లండ్ జట్టు రూట్ కెప్టెన్సీలో పాతాళానికి పడిపోయినప్పటికి బ్యాటర్‌గా మాత్రం తాను ఎప్పుడు విఫలమవ్వలేదు. ఇంగ్లండ్ జట్టులో గత పదేళ్లలో స్థిరంగా పరుగులు సాధించిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది రూట్ మాత్రమే.
ఒకానొక దశలో 52 ఉన్న స్ట్రైక్‌రేట్ కాస్త 81.2కు పెరగడం చూస్తే రూట్ ఏ స్థాయిలో ఆడాడన్నది అర్థమవుతుంది. అయితే కొంతకాలంగా రూట్ బ్యాట్ మూగబోయింది. ఒకప్పుడు పరుగులు వెల్లువలా వచ్చిన బ్యాట్ నుంచి ఇప్పుడు కనీసం అర్థసెంచరీ కూడా రాలేకపోతుంది. గత 11 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు ఫిఫ్టీలు మాత్రమే కొట్టి 242 పరుగులు చేసిన రూట్ సగటు 22కు పడిపోయింది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కొంతకాలం స్థిరంగానే ఆడాడు.
అయితే క్రమంగా స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టులోనే బలంగా తయారవుతున్న వేళ రూట్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. చివరగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన రూట్.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో పాటు పాకిస్తాన్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రూట్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయితే తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా రూట్ ఫామ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇంగ్లండ్ 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
స్టోక్స్ నేతృత్వంలో సరికొత్తగా దూసుకెళ్తున్న టెస్టు టీమ్‌లో తన రోల్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లండ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. తొలిరోజునే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంపై విమర్శలు వచ్చినప్పటికి.. స్టోక్స్‌కు తన జట్టు బౌలర్లపై ఉన్న నమ్మకం ఏంటనేది మరుసటి రోజే తెలిసొచ్చింది. అయితే ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ వేగంగా మారుతున్న సమయంలో రూట్ ఏ స్థానంలో రావాలనేది కాస్త డైలమాలో పడింది. తన కెరీర్‌లో రూట్ ఎక్కువ భాగం మూడో స్థానంలో వచ్చేవాడు. మూడో స్థానంలో వచ్చి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. ఇవాళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు.
ఇదే అంశంపై విజ్డెన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రూట్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు వేగంగా మారుతోంది. కాలానికి అనుగుణంగా బజ్‌బాల్‌తో స్టోక్స్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోచ్ మెక్‌కల్లమ్- కెప్టెన్ స్టోక్స్‌ల ఆధ్వర్యంలో ఎలా బ్యాటింగ్ చేయాలనేది పరిశీలిస్తున్నా. కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటపడ్డాకా కాస్త రిలీఫ్ అనిపించింది. అయితే ఇప్పుడు జట్టులో నా రోల్ ఏంటనేది తెలుసుకోవాలి. వినడానికి సిల్లీగా అనిపిస్తున్నప్పటికి ఇది నిజం. గత కొన్ని మ్యాచ్‌లుగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నా.
ఎంత సీనియర్ క్రికెటర్ అయినా పరుగులు చేయలేకపోతే జట్టులో స్థానం పోతుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రివర్స్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నా. ఇది గమనించిన మెక్‌కల్లమ్.. ఏం కాదులే మరోసారి ప్రయత్నించు.. అంటూ మద్దతిచ్చాడు. అయితే రివర్స్ స్కూప్ ఆడడంలో తాను ఒకప్పుడు సిద్ధహస్తుడిని.. ఇప్పుడు ఆ 'రూట్' దారి తప్పింది. తిరిగి దానిని అందుకోవాలి'' అంటూ ముగించాడు.
చదవండి: Team India: సూర్య తప్ప.. స్వస్థలాలకు టీమిండియా క్రికెటర్లు
BGT 2023 IND VS AUS: ఆసీస్‌కు బిగ్ షాక్.. మరో వికెట్ డౌన్
Comments
Please login to add a commentAdd a comment