Netizens Trolls Indian Cricket Team Selection Committee - Sakshi
Sakshi News home page

IND vs WI: అతడేం నేరం చేశాడు.. ప్రతీసారి ఇంతే! నిజంగా సిగ్గుచేటు!

Published Fri, Jun 23 2023 4:32 PM | Last Updated on Fri, Jun 23 2023 5:09 PM

Netizens trolls indian cricket team selection committee - Sakshi

వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు తొలి సారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. అయితే దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 78 పైగా సగటుతో అదరగొడుతున్న సర్ఫరాజ్‌కు సెలక్టర్లు ఛాన్స్‌ ఇవ్వకపోవడం అందర్నీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది.

అ‍య్యో సర్పరాజ్‌..
కాగా సర్ఫరాజ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్‌ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్‌లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్‌లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్‌.. 3175 పరుగులు చేశాడు.

అతడి ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 11 సెంచరీలు , 9 హాఫ్‌ సెంచరీలు ఉండడం గమానార్హం. ఇక అభినవ బ్రాడ్‌మన్‌గా పేరొందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరును అభిమానులు తప్పుబడుతున్నారు. 

ఈ క్రమంలో భారత సెలక్షన్‌ కమిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెలక్షన్‌ కమిటీ కావాలనే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయడం లేదని, అతడేం నేరం చేశాడని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ స్ధానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కెఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. 

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

చదవండి: IND Vs WI India Sqaud: వెస్టిండీస్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. జైశ్వాల్‌, రుత్‌రాజ్‌ ఎం‍ట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement