
ఢిల్లీ యువ సంచలనం, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య రెడ్‌బాల్ క్రికెట్‌లో అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం ఎంపిక చేసిన 24 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యకు చోటు దక్కింది. రంజీ ట్రోఫీ జట్టుకు ఆర్య ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)తో వెలుగులోకి వచ్చిన ఆర్య.. ఈ ఏడాది ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్-2025లో అద్బుతమైన సెంచరీతో ఆర్య చెలరేగాడు. ఆ తర్వాత భారత-ఎ జట్టుకు కూడా వైట్ బాల్ క్రికెట్‌లో ఆర్య ప్రాతినిథ్యం వహించాడు. ఆసీస్-ఎపై కూడా మూడెంకెల స్కోరు అతడు అందుకున్నాడు. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లో కూడా సత్తాచాటాలని ప్రియాన్ష్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇక రాబోయే రంజీ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఆయూష్ బదోని ప్రాతినిథ్యం వహించనున్నాడు. యువ ఆటగాడు యష్ ధుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అంతేకాకుండా సీనియర్ ప్రో నితీష్ రాణా తిరిగి జట్టులోకి వచ్చాడు. గతేడాది సీజన్‌లో యూపీకి ప్రాతినిథ్యం వహించిన రాణా.. తన మనసు మార్చుకుని తిరిగి ఢిల్లీకి ఆడనున్నాడు.
యుష్ దోసేజా, వైభవ్ కండ్‌పాల్, మనీ గ్రెవాల్ వంటి డీపీఎల్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ఢిల్లీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 18వరకు హైదరాబాద్ వేదికగా జరగనుంది.
రంజీ ట్రోఫీకి ఢిల్లీ జట్టు: ఆయుష్ బదోని (కెప్టెన్), యశ్ ధుల్ (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, అనుజ్ రావత్, సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, రౌనక్ వాఘేలా, నవదీప్ సైనీ, సిమర్‌జీత్ సింగ్, మనీ గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ, ధ్రువ్ రజవాణి, ధృవ్ రజవాణి, ప్రణయ్‌త్వ్ కౌశిక్, దోసెజా, రాహుల్ దాగర్, హృతిక్ షోకీన్, ప్రియాంష్ ఆర్య, తేజస్వి దహియా, వైభవ్ కంద్‌పాల్, రోహన్ రాణా, ఆర్యన్ రాణా (ఫిట్‌నెస్‌కు లోబడి).
చదవండి: రోహిత్‌కే కాదు.. నాకు ద్రవిడ్‌కు ఇలానే జరిగింది: సౌరవ్ గంగూలీ