IND Vs WI 4th T20: టి20 క్రికెట్‌లో రోహిత్‌ సేన కొత్త చరిత్ర..

Team India sets new RECORD vs West Indies with T20 series win - Sakshi

వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా మరో సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ సేన టి20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది వరుసగా ఐదో టి20 సిరీస్‌ విజయం కావడం విశేషం. ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఐలాండ్‌ దేశాలపై భారత్‌కు ఇది 13వ సిరీస్‌ విజయం. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్‌ (23 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనంతరం విండీస్‌ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్‌ (24), రావ్‌మన్‌ పావెల్‌ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. భారత బౌలర్లలో అర్‌‡్షదీప్‌ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్‌ పటేల్‌ తలా 2 వికెట్లు తీశారు. చివరిదైన ఐదో టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. 

చదవండి: India vs West Indies: ఘన విజయంతో సిరీస్‌ భారత్‌ సొంతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top