అతడు అద్భుతం.. ఆ అవకాశాన్ని నేను లాక్కోలేను: తిలక్‌ వర్మ | Tilak Varma Lauds Naman Dhir, Opens Up On Bowling Plans After Match Winning Knock Against New Zealand In T20 Series, Read Story Inside | Sakshi
Sakshi News home page

అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. ఆ అవకాశాన్ని నేను లాక్కోలేను: తిలక్‌ వర్మ

Oct 29 2026 1:50 PM | Updated on Oct 29 2026 2:59 PM

Tilak Varma Lauds Naman Dhir Reveals His Bowling Plans For India

తిలక్‌ వర్మ (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలి టీ20 (11 బంతుల్లో 6 పరుగులు)లో వన్‌డౌన్‌లో వచ్చి విఫలమైనప్పటికీ.. రెండో టీ20లో మాత్రం ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్ములేపాడు.

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా కివీస్‌ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్‌ తడబడగా.. ఆరో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఓడిపోయే మ్యాచ్‌లో గెలిపించాడు
తద్వారా ఓడిపోయే మ్యాచ్‌లో టీమిండియాను తిలక్‌ వర్మ దగ్గరుండి గెలిపించాడు. అతడికి తోడుగా నమన్‌ ధీర్‌ (17 బంతుల్లో 31), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13 బంతుల్లో 26*) రాణించారు. ఇక మూడో టీ20లో తిలక్‌ వర్మకు పెద్దగా బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరమే లేకుండా గెలిచిన జట్టు.. 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

 

అద్భుతంగా ఆడుతున్నాడు
ఈ క్రమంలో కివీస్‌- భారత్‌ మధ్య శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా నాలుగో టీ20 జరగనున్న నేపథ్యంలో తిలక్‌ వర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను బౌలింగ్‌ మీద కూడా శ్రద్ధ పెట్టినట్లు ఈ పార్ట్‌టైమ్‌ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ తెలిపాడు. ప్రస్తుతం నమన్‌ ధీర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడని.. కాబట్టి తన అవసరం లేదని పేర్కొన్నాడు.

గట్టిగానే బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను
ఈ విషయాల గురించి ANIతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్‌ చేసే అంశం గురించి యాజమాన్యం నాతో చర్చించింది. నేను కూడా బౌలింగ్‌ మీద శ్రద్ధ పెట్టాను. అయితే, ప్రస్తుతం జట్టులో నమన్‌ ధీర్‌ ఉన్నాడు.

అతడు బౌలింగ్‌ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి వెంటనే నేను బంతితో రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. అయితే, నెట్స్‌లో మాత్రం గట్టిగానే బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. బౌలింగ్‌ విషయంలో నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అవకాశం వచ్చినపుడు కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటా.

ఆ అవకాశాన్ని లాక్కోవడం సరికాదు
ముందుగా చెప్పినట్లు నమన్‌ టీ20లలో ప్రస్తుతం అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అలాంటపుడు అతడి నుంచి బంతిని లాక్కోవడం సరికాదు. అవసరం ఉన్నపుడు మాత్రం నేను కచ్చితంగా బౌలింగ్‌ చేస్తా’’ అని తిలక్‌ వర్మ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలనని వెల్లడించాడు.

కాగా కివీస్‌తో టీ20లలో నమన్‌ ధీర్‌ ఇటు బాల్‌తో.. అటు బ్యాట్‌తో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడిన 26 ఏళ్ల ఈ హర్యానా ప్లేయర్‌.. 115 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు కూల్చాడు.

మరోవైపు.. 23 ఏళ్ల తిలక్‌ వర్మ 73 టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 1898 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటికి ఐదు వన్డేల్లో 68 పరుగులు చేశాడు. కానీ ఇప్పటి వరకు వికెట్‌ తీయలేదు. కివీస్‌తో ఆఖరి రెండు వన్డేలకు తిలక్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌!.. వన్డే సిరీస్‌ నుంచి కీలక ఆటగాడు అవుట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement