బస్‌ డ్రైవర్‌ను హగ్‌ చేసుకున్న కివీస్‌ స్టార్‌ బౌలర్‌.. వీడియో వైరల్‌ | Trent Boult Hugs New Zealand Team Bus Driver Heart Full Video Viral | Sakshi
Sakshi News home page

Trent Boult: బస్‌ డ్రైవర్‌ను హగ్‌ చేసుకున్న కివీస్‌ స్టార్‌ బౌలర్‌

Published Tue, Nov 16 2021 9:08 PM | Last Updated on Tue, Nov 16 2021 9:46 PM

Trent Boult Hugs New Zealand Team Bus Driver Heart Full Video Viral - Sakshi

Trent Boult Hugs Bus Driver.. టి20 ప్రపంచకప్‌ను అందుకోవడంలో విఫలమైన న్యూజిలాండ్‌ చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైన కివీస్‌ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్‌ నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ జట్టు ఎయిర్‌పోర్ట్‌ వరకు బస్‌లో వచ్చింది. న్యూజిలాండ్‌ జట్టును తీసుకొచ్చిన బస్‌ డ్రైవర్‌ సంతోష్‌ బౌల్ట్‌ను కలవాలని భావించాడు. అడిగిందే తడవుగా బౌల్ట్‌ ఆ బస్‌ డ్రైవర్‌తో సెల్ఫీ దిగి ఆ తర్వాత అతన్ని హగ్‌ చేసుకొని సంతోషపరిచాడు.

చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్‌ అయ్యర్‌పై ద్రవిడ్‌ దృష్టి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో​ వైరల్‌గా మారింది. ఇక టీమిండియాతో మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. కివీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టి20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి రానున్నాడు. నవంబర్‌ 17న ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement