మంత్రి సవిత అండతోనే..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక, మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మంత్రి సవిత అండ తోనే ఆమె అనుచరులు కొత్తపల్లి గ్రామ చెరువును కొల్లగొట్టారు. శ్మశాన వాటికనూ వదలని పరిస్థితి. మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో నీటి పారుదల, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు యంత్రాగం పూర్తిగా విఫలమైంది. ప్రశ్నించిన వారిపై టీడీపీ గుండాలను రెచ్చగొట్టి వదిలారు. ఇసుక, మట్టి అక్రమ తరలింపులు ఇప్పటికై నా ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుంది.
– కేవీ ఉష శ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షురాలు


