భూముల రీసర్వేతో రైతులకు లబ్ధి
గార: భూముల రీసర్వే 4.0తో రైతులకు లబ్ధి చేకూ రుతుందని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గార మండలం అంపోలు పంచాయతీలో సర్పంచ్ గొండు జయరాం అధ్యక్షతన భూమి రీసర్వే 4.0ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌లతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస భ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టిందన్నారు. అనంతరం అంపోలు పంచాయతీలో డ్రోన్ ద్వారా తీసిన సర్వే మ్యాపును తహశీల్దార్ మునగవలస చక్రవర్తి చూపించి వివరాలు తెలియజేశారు. స్థానిక అగస్త్యేశ్వర చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి చేనేత కార్మికులు సమస్యలు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓలు కేవీవీ జగన్నాథం, ఆర్.సత్యనారాయణ ఎంపీటీసీలు గొండు అచ్యుతరావు, పొదిలాపు రామజోగి తదితరులు పాల్గొన్నారు.


