104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీఐటీయూ నాయకులు(యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్) మురళి, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.గోవర్ధనరావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో అనుబంధ సంఘాల అఖిలపక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా అధ్యక్షుడు చల్ల నారాయణ మాట్లాడు తూ క్యాజువల్ లీవ్‌లు పునరుద్ధరించాలని, ప్రభు త్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రామారావు మాట్లాడుతూ బఫర్ సిబ్బందిని తిరిగి నియమించి ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి మహేష్, సీఐటీయూ నాయకులు సాయి ప్రకాష్, అంగన్‌వాడీ నాయకురాలు కళ్యాణి, ఆశ వర్కర్లు యూనియన్ నాయకులు నాగమణి, 108 ప్రెసిడెంట్ విజయమోహన్, సీతారాం రాజు, డివిజన్ నాయకులు కూర్మారావు, మహేష్ కిరణ్, బాలకృష్ణ పాల్గొన్నారు.


