ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సునీత అగర్వాల్ కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వీరి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తదితరులున్నారు.
ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ క్యాలెండర్‌ను శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆవిష్కరించారు. ఉన్న త విద్యారంగ అభివృద్ధిలో వర్సిటీతో కలిసి పనిచేయాలని సంఘ ప్రతినిధులకు వీసీ సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.చక్రపతి, కార్యదర్శి ఎస్.రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కార్యదర్శి డి.పైడితల్లి, యూనివర్సిటీ కార్యదర్శి బి.మోహనరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 28 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో కిమ్స్ వైద్యులను సంప్రదించింది. ఆమెకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యు లు గుర్తించారు. ఓ 32 ఏళ్ల మహిళ కిడ్నీని ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కిమ్స్ వైద్యులు డిసెంబర్ 24న శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో శనివా రం ఆమెను డిశ్చార్జి చేసేందుకు నిర్ణయించా రు. శస్త్రచికిత్స విజయవంతం కావడంలో వైద్యులు ఉమామహేశ్వర్, మురళి, బి.రమణ, గౌతమి, బాలకష్ణ, మురళీ, ఝాన్సీలక్ష్మి, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ జోగినాయుడు కీలక పాత్ర పోషించారు. వీరిని కిమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, డాక్టర్ గూడెన సోమేశ్వరరావు శుక్రవారం అభినందించారు.
శ్రీకాకుళం రూరల్: అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను ఈ ఏడాది వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. శుక్రవారం సింగుపురం పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమి ఈ నెల 25 కాగా.. 19 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలను ప్రణాళికాబద్ధగా నిర్వహిస్తామ న్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇటీవల వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రి లో చేరిన వారిని డబ్బులు డిమాండ్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగుపురంలో ని నర్సింగ్ వైద్య కళాశాల ఫిబ్రవరి మొదటి వా రంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.ఎం.జె.బాబు, సర్పంచ్ ఆదిత్యనాయుడు పాల్గొన్నారు.
తెలుగు మహాసభలకు శరత్‌బాబు
శ్రీకాకుళం కల్చరల్ : గుంటూరులో కరుణశ్రీ, జాషువా సాహితీ వేదికపై ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనం సహ సమన్వయకర్తగా శ్రీకాకుళం రచయిత, విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధి జంధ్యాల శరత్‌బాబు నియమితులయ్యారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగు తోరణం ప్రదర్శన, గ్రంథాల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని శరత్‌బాబు శుక్రవారం తెలిపారు.
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్


