●ఒత్తిడి తట్టుకోలేక..
ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి శంకర్, లోలమ్మల రెండో కొడుకు మాసుపత్రి విజయ్(21) ఏడు నెలల కిందట తన అన్నయ్య బన్నీతో కలసి అబుదాబి వెళ్లాడు. సోదరులిద్దరూ ఓ కంపెనీలో ఫిట్టర్లుగా పనిచేసేవారు. అక్టోబర్ 22 తెల్లవారుజామున ఆరు గంటలకు విజయ్ తల్లిదండ్రుల తో బాగానే మాట్లాడాడు. తర్వాత ఏమైందో గానీ పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్తను చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు ఉన్నచోటనే కుప్పకూలిపోయారు. వారం రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామం చేరుకుంది. సంబంధిత కంపెనీ నుంచి పరిహారమే దక్కలేదు.
●ఒత్తిడి తట్టుకోలేక..


