బోధన సామర్థ్యాలు పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

బోధన సామర్థ్యాలు పెంపొందించాలి

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

బోధన

బోధన సామర్థ్యాలు పెంపొందించాలి

బోధన సామర్థ్యాలు పెంపొందించాలి

కంచిలి:

బోధన సామర్థ్యాలు మరింతగా పెంపొందించి, ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు కృషిచేయాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. ఆయన కంచిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఉరిటి జగదీష్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అంతకన్నా ముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ఫిజిక్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ సొంత నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమ లు తీరును పరిశీలించారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సి పాల్‌, అధ్యాపకులు వేణుగోపాల్‌, దాస్‌ పాల్గొన్నారు.

బోధన సామర్థ్యాలు పెంపొందించాలి 1
1/1

బోధన సామర్థ్యాలు పెంపొందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement