మహిళా క్రికెట్‌ నెట్స్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌ నెట్స్‌ ప్రారంభం

Jan 5 2026 7:27 AM | Updated on Jan 5 2026 7:27 AM

మహిళా క్రికెట్‌ నెట్స్‌ ప్రారంభం

మహిళా క్రికెట్‌ నెట్స్‌ ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో క్రికెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ హామీఇచ్చారు. శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో మహిళలు/బాలికల క్రికెట్‌ సాధనకు ఏసీఏ తోడ్పాటుతో జిల్లా క్రికెట్‌ సంఘం (జెడ్‌సీఎస్‌) ఏర్పాటు చేసిన క్రికెట్‌ నెట్స్‌, టర్ఫ్‌ వికెట్‌, ఆస్ట్రో టర్ఫ్‌వికెట్‌, జిల్లా క్రికెట్‌ సంఘ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రునివసలో ఖేలో ఇండియా మల్టీ స్టేడియం మైదానం కేటాయించిన ప్రాంతంలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌కు జెడ్‌సీఎస్‌ తరఫున రూ.50వేల చెక్కును బాస్కెట్‌బాల్‌ సంఘ కార్యదర్శి, కోచ్‌ అర్జున్‌రెడ్డికి అందజేశారు. దివ్యాంగుల క్రికెట్‌లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహంచిన వర్షత్‌ను సత్కరించారు. కార్యక్రమలో జిల్లా క్రికెట్‌ సంఘం మెంటార్‌ ఇలియాస్‌ మహ్మద్‌, కోశాధికారి మదీనా శైలానీ, ఏసీఏ ప్రతినిధులు నాగ గంగాధర్‌, వంశీ, దుప్పల వెంకటరావు, ప్రిన్సిపాల్‌ పి.సురేఖ, జెడ్‌సీఎస్‌ ౖౖకౌన్సిలర్‌ ఎస్‌.రవికుమార్‌, సీహెచ్‌ విజయభాస్కర్‌, బాస్కెట్‌బాల్‌ కోచ్‌ గాలి అర్జున్‌రావురెడ్డి, పాండ్రంగి శంకర్‌, రమేష్‌, క్రికెట్‌ కోచ్‌లు కె.సుదర్శన్‌, ఆనంద్‌కుమార్‌, కె.కిరణ్‌, పీడీ మోహన్‌రాజ్‌ తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement