ఉపాధ్యాయినులకు పూలే అవార్డులు
శ్రీకాకుళం కల్చరల్/జి.సిగడాం: తిరుపతికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్‌మెంట్ నిర్వాహకులు ఉపాధ్యా వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే లెగసీ అవార్డులను ప్రదానం చేశారు. శ్రీకాకుళం వరం మున్సిపల్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తిమ్మరాజు నీరజకుమారి, సీతంపేట జి.టి.డబ్ల్యూ.ఎ.జి.హెచ్.స్కూల్ హెచ్‌ఎం తిమ్మరాజు వసంతలక్ష్మి, జి.సిగడాం మండలం బూటుపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కూర్మాన అరుణకుమారి ఈ అవార్డులను అందుకున్నారు.
ఉపాధ్యాయినులకు పూలే అవార్డులు


