ఐటీడీఏ ఆశ అడియాసేనా..? | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

Jan 5 2026 7:41 AM | Updated on Jan 5 2026 7:41 AM

ఐటీడీ

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం వారిని చావుకు దగ్గర చేసింది. లారీ రూపంలో దారి కాచిన మృత్యువు తల్లీపిల్లలను తీసుకెళ్లిపోయింది. అమ్మ పక్కనే హాయిగా పడుకున్న బిడ్డలను కనికరం లేకుండా చంపేసింది. లిప్తపాటు కాలంలో ఆ కుటుంబాన్ని కారు చీకటి కమ్మేసింది. కొర్లాం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు బిడ్డలు ఊపిరి వదిలేశారు.

సోంపేట: కొర్లాం జాతీయ రహదారి నుంచి బారువ వెళ్లే రహదారి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో అమాంతం దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఒడిశా బాలాసోర్‌కు చెందిన కనక లత(31) ఆమె బిడ్డలు అభిలాష (8), ఆది త్య (1) దుర్మరణం పాలయ్యారు. వారు స్వస్థలం నుంచి అప్పటికే 550 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో 250 కిలోమీటర్లు వెళ్తే గమ్యస్థానం చేరుకునేవారు. కానీ లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. బారువ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌కు చెందిన కనకలత విశాఖలో పనిచేస్తున్నారు. ఆదివారం వారి స్వగ్రా మం బాలాసోర్‌ నుంచి విశాఖ వెళ్లేందుకు ట్రావెల్‌ కార్‌ బుక్‌ చేసుకున్నారు. కనకలతతో పాటు కుమార్తె అభిలాష, పది నెలల కుమారుడు ఆదిత్యతోపాటు పదేళ్ల జానకి అనే మరో అమ్మాయి ఉన్నారు. డ్రైవర్‌తో కలిపి మొత్తం ఐదుగురు ఉదయమే బయల్దేరారు. కారు కొర్లాం జాతీయ రహ దారి జంక్షన్‌ వద్దకు చేరుకుంది. అదే సమయంలో పలాస నుంచి బరంపురం వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను దాటి రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించి అమాంతం కారును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదంలో కారు లో ఉన్న కనకలత, అభిలాష, ఆదిత్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నాగరాజు, మరో బాలిక జానకిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బారువ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహ దారి భద్రతా సిబ్బంది, బారువ పోలీసులు, స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని కారులో ఉన్న వారికి బయటకు తీశారు. పసిబాలుడు ఆదిత్య, మరో పాప అభిలాష కొన ఊపిరితో ఉండగా వారికి బతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పసివాళ్ల కష్టం చూసి అక్కడున్న వారు కంట నీరు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ప్రమాదంపై బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

కారులో బాధితులు

కనకలత

మృతదేహం

మూడు బస్సులు మారాలి..

సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లడమే పెద్ద సమస్యగా మారుతోంది. సీతంపేట వరకు వెళ్లాలంటే రూ.500 ఖర్చవుతుంది. ఎన్నిసార్లని వెళ్లగలం. మా మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. – సవర గణేష్‌,

పుస్తలవార గ్రామం, మెళియాపుట్టి మండలం

పోరాటాలు చేస్తూనే ఉన్నాం

మా గిరిజన ప్రజల కష్టాలు తీరాలంటే ఐటీడీఏ అవసరం. రాష్ట్రం, జిల్లా స్థాయిలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ దృష్టిలో పెట్టాం. ఇటీవల మెళియాపుట్టి మండలం కేరాసింగి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం స్పందించాలి. – వాబ యోగి,

ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

మెళియాపుట్టి: జిల్లాల పునర్విభజనలో భాగంగా సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలో కలిసిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని పలువురు నేత లు హామీ ఇచ్చారు. కానీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో గిరిజనులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపేటకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఎన్నికల ముందు పాతపట్నం నియోజక వర్గానికి ఏ నేత వచ్చినా.. మెళియాపుట్టిలో ఐటీ డీఏ ఏర్పాటు చేస్తామని చెప్పేవారు. ఇదే హామీతో గిరిజనుల ఓట్లు దండుకున్నారు. అధికారం దక్కాక ఇచ్చిన మాట మర్చిపోయారు.

జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో అధికంగా గిరిజనులు ఉన్నారు. 16 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉన్నాయి. విభజన ప్రక్రియలో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 847 గిరిజన గ్రామాలు ఉండగా శ్రీకాకుళం జిల్లాకు 469, మన్యం జిల్లాకు 378 గ్రామాలను కేటాయించారు. అయితే విభజన అనంతరం అధికారులు గిరిజన గ్రామాల్లోని సమస్యలు ఎక్కడికక్కడే వదిలేశారని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా నానా అవస్థలు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. అత్యధిక గిరిజన గ్రామాలు ఉండి, అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే మెళియాపుట్టి మండలకేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఇది వరకే గిరిజన సంఘాలు పలు సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేశాయి. కానీ సర్కారు స్పందించలేదు. మందస, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ అందని ద్రాక్షలామారింది. సమస్యలున్నా సీతంపేట వరకు వెళ్లలేకపోతున్నారు. ఇక్కడే ఐటీడీఏ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

కొర్లాం జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం

కారును ఢీకొట్టిన లారీ

ముగ్గురు తల్లీపిల్లల దుర్మరణం

మృతులంతా ఒడిశా వాసులు

మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఎప్పుడో..?

కోటి ఆశలు పెట్టుకున్న గిరిజనులు

సమస్యలు చెప్పుకోవడానికి సీతంపేట వెళ్లాల్సి వస్తోందని ఆవేదన

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 1
1/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 2
2/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 3
3/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 4
4/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 5
5/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 6
6/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 7
7/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

ఐటీడీఏ ఆశ అడియాసేనా..? 8
8/8

ఐటీడీఏ ఆశ అడియాసేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement