లక్ష్మీనర్సింహస్వామి జాతర షురూ
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
గీసుకొండ: గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు ‘లక్ష్మీనర్సింహ స్వామి గోవిందా’ అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ జాతరకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ సొంత ఖర్చుతో జాతరకు వచ్చే భక్తుల కోసం ఉచితంగామినరల్ వాటర్ సరఫరా చేసినట్లు ఉపసర్పంచ్ కోట ప్రమోద్ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, కమిటీ సభ్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించారు. ఎంసీపీఐ కార్యకర్తలు తీసుకువచ్చిన ప్రభబండి ప్రత్యేకతను చాటుకుంది. స్వామివారి జాతర మరో రెండు రోజులు పాటు కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తున్న భక్తులు
రాజకీయ
ప్రభబండి
లక్ష్మీనర్సింహస్వామి జాతర షురూ
లక్ష్మీనర్సింహస్వామి జాతర షురూ


