అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చలివెందులలో టిడిపి అభ్యర్ధి బాలకృష్ణకు చుక్కెదురైంది. ప్రజల సైగలు ఆయనకు షాక్ ఇచ్చాయి. చలివెందుల గ్రామంలో టిడిపికి ఓటు వెయ్యాలని బాలయ్య విక్టరీ సింబల్ చూపించారు. అందుకు ప్రతిగా అక్కడ గుమిగూడిన జనం ఫ్యాన్ తిరుగుతున్నట్లు చేతి సైగలు చేశారు. దాంతో ఆయనకు మతిపోయినట్లు అయింది. ఆ గ్రామంలో వైఎస్ఆర్ సిపి అభిమానులు అధికమంది ఉన్నట్లున్నారు. అందుకే వారు ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతున్న సైగలు చేశారు.