ధోని 99 నాటౌట్!
పల్లెకెలె: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుకు చేరువయ్యాడు. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్ లు చేసిన వికెట్ కీపర్ గా నిలిచేందుకు ధోని కేవలం అడుగుదూరంలో నిలిచాడు. శ్రీలంకతో రెండో వన్డేలో డిక్ వెల్లాను స్టంప్ చేయడం ద్వారా 99 వ స్టంపింగ్ ను ధోని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర (99) అత్యధిక స్టంపింగ్ ల రికార్డును ధోని సమం చేశాడు. ఇంకో ఒక స్టంపింగ్ చేస్తే ధోని సెంచరీ మార్కును చేరడమే కాకుండా వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్ గా రికార్డు సృష్టిస్తాడు.
ఈ సిరీస్ కు ముందు ధోని 97 స్టంపింగ్స్ తో ఉన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో లసిత్ మలింగాను స్టంపింగ్ చేసి 98 స్టంపింగ్ ను సాధించాడు. తాజా మ్యాచ్ లో గుణతిలకాను స్టంపింగ్ గా పెవిలియన్ కు పంపి సంగక్కర రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంచితే వన్డేల్లో 377 అవుట్లు ధోని ఖాతాలో ఉన్నాయి. ఇందులో 278 క్యాచ్లు ఉండగా, 99 స్టంపింగ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా వికెట్ కీపర్ గా అత్యధిక అవుట్లు చేసిన జాబితాలో ధోని నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ సంగక్కర(482) తొలి స్థానంలో ఉండగా, ఆడమ్ గిల్ క్రిస్ట్(472), మార్క్ బౌచర్(424) ఆ తరువాత వరుస స్థానాల్లో నిలిచారు .ప్రస్తుతం 298వ వన్డే ఆడుతున్న ధోని.. ఇంక రెండు మ్యాచ్ లు ఆడితే మూడొందల వన్డే మార్కును చేరతాడు. అంతకుముందు భారత మాజీ క్రికెటర్లు మొహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ లు మాత్రమే మూడొందల మార్కును చేరిన భారత క్రికెటర్లు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన వారు 19 మంది ఉన్నారు.