లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి! | it was a conspiracy, says Malayalam actress | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి!

Published Mon, Apr 3 2017 5:57 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి! - Sakshi

లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి!

ముంబై: గత ఫిబ్రవరిలో ప్రముఖ మలయాళం నటిని కిడ్నాప్‌ చేసి.. ఆమె కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంత పరిచింది. ఆమె ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఈ ఘటనపై అధికారికంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో ఆమె డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు.. ఈ దుర్మార్గానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పల్సర్‌ సునిని పోలీసులు అరెస్టుచేశారు.

ఈ నేపథ్యంలో తొలిసారి నటి తనపై జరిగిన దుర్మార్గంపై పెదవి విప్పారు. మలయాళం మ్యాగజీన్‌ వనితకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కేవలం డబ్బు కోసమే తనపై ఈ దారుణం జరిగిందని తాను అనుకోవడం లేదని, దీని వెనుక కుట్ర ఉందని కుండబద్దలు కొట్టారు. 'సినీ నటులను లోకేషన్‌ నుంచి తీసుకుపోయే ఒక డ్రైవర్‌ ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టగలడు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు. ఈ ఘటన వెనుక నా శత్రువులు ఉన్నారని నేను చెప్పడం లేదు. కానీ కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశారని వారు అంటున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. నన్ను తొలిచివేస్తున్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కావాలి. అప్పటివరకు నేను పోరాడుతూనే ఉంటాను' అని ఆమె స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో తన పోరాటం, తనకు ఉన్న ప్రత్యర్థుల గురించి వివరిస్తూ.. 'సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు కానీ, శాశ్వత శ్రతువులు కానీ ఉండరని అంటారు. కానీ నా విషయంలో నాకు శాశ్వత స్నేహితులు, శాశ్వత శత్రువులు సినీ పరిశ్రమలో ఉన్నారు. నేను చేయని తప్పులకు ఏనాడూ నేను క్షమాపణలు చెప్పను. అహంకారిగానైనా పేరు తెచ్చుకుంటాను కానీ, క్షమాపణలు చెప్పి, రాజీపడి అవకాశాల కోసం ఒకరి వద్ద దేబరించుకోను' అని నటి పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలపై మౌనంగా ఉండవద్దని, ఇతర బాధితులు కూడా ముందుకొచ్చి తమ గోడును ప్రపంచానికి తెలుపాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement