Mayawati
-
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్‌ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్‌పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
ఇకపై మాది ఒంటరిపోరే: మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు. -
రాజకీయాల నుంచి వైదొలగడం లేదు: మాయావతి
లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.‘‘డాక్టర్. అంబేద్కర్, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్ ముందుకు తీసుకువెళ్తారు. నాపై వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.26-08-2024-BSP PRESS NOTE-SANYAS FAKE NEWS pic.twitter.com/nhbBIEJhUl— Mayawati (@Mayawati) August 26, 2024 -
ఢిల్లీలో కనిపించని భారత్ బంద్ ప్రభావం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.మాయావతి మద్దతుభారత్ బంద్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।— Mayawati (@Mayawati) August 21, 2024 -
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన మాయావతి, ఆజాద్
ఉత్తరప్రదేశ్‌లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్‌సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్‌లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్‌ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్‌కు సన్నిహితుడైన షా నాజర్‌ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్
చెన్నై : పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు. శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్‌స్ట్రాంగ్ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు. హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను డిమాండ్ చేశారు.#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9— ANI (@ANI) July 7, 2024 ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును గమనిస్తే.. తమిళనాడులో అసలు శాంతి భద్రతలు లేవనిపిస్తోందని అన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
ఆకాష్‌పై అలక వీడిన మాయావతి
మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేశారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఆకాష్ ఎన్నికల సమయంలో సీతాపూర్‌లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్‌పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. #WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati holds a meeting with party workers in Lucknow. pic.twitter.com/b5bBrDlesv— ANI (@ANI) June 23, 2024 -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆకాష్ ఆనంద్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్‌ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ తరపున ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్‌ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్‌లకు టికెట్ ఇచ్చింది.దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్పీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం. -
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్‌సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్‌పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్‌లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోనూ ఇదే పరిస్థితి! లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్‌దళ్‌తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. -
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ముఖ్తార్ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి. पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें। पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च… — Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024 -
UP: సింగిల్‌గా పోటీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సహరాన్పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్‌లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్‌పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు. -
అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి
BSP Mayawati : రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పేశారు. తమ పార్టీ పొత్తుతో వెళ్తుందని వస్తున్న వదంతులన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఈ మేరకు మాయావతి పోస్ట్ చేశారు. ‘రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తన సొంత బలంతో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీ పూర్తి సన్నద్ధత, బలంతో ఉంది. ఇటువంటి పరిస్థితిలో పొత్తులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వస్తున్నవి తప్పుడు వార్తలు. ఇలాంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రణాళికల గురించి మాయావతి పేర్కొంటూ.. “ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఇతర పక్షాలు అసహనానికి గురవుతున్నాయి. అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే బీఎస్పీ నిర్ణయం దృఢమైనది" అన్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ నుంచి లోక్‌సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్‌పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్‌పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్‌సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్‌తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్‌సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్‌తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్‌పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
ఇండియా కూటమికి షాక్.. మాయావతి కీలక ప్రకటన
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్టు మాయావతి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజకీయాల్లో తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మాయావతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తు ఉండదు. ఎన్నికల అనంతరం పొత్తుల విషయంపై ఆలోచిస్తాం. అప్పుడు పొత్తులు ఉంటే ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైంది. పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అయినప్పటికీ.. అటు ఓట్లు మాత్రం ఇటు రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే ఈ సారి ఎన్నికలకు వెళతాం’ అని స్పష్టం చేశారు. VIDEO | "I want to clarify that our party (BSP) will go solo in the upcoming (2024) Lok Sabha polls. With the backing of people from backward community, Dalits, tribals and Muslims, we had formed a full majority government in UP in 2007, and that's why we have decided to contest… pic.twitter.com/oatnx167db — Press Trust of India (@PTI_News) January 15, 2024 దీంతో, తాము ఇండియా కూటమిలో చేరడం లేదని మాయవతి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మాయావతి తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. ఇదే సమయంలో రామమందిర ప్రాణప్రతిష్టకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తమది సెక్యూలర్ పార్టీ అని చెప్పుకొచ్చారు. -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్‌నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్‌లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్ ఆనంద్
లక్నో: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారుసుడిని ప్రకటించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మినహా మిగతా దేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్, ఫలితాలపై చర్చించారు. అదే విధంగా 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆకాశ్ ఆనంద్.. మాయావతి పాత్ర పోషించనున్నారు. గత ఏడాడి నుంచి ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయన్ అయిన ఆనంద్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో స్టార్ క్యాంపేయినర్‌గా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2022లో ఆయన రాజస్థాన్‌లోని అల్వార్‌లో 13 కిలో మీటర్ల ‘స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. 2018 రాజస్థాన్‌లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్.. కీలకమని పోల్ క్యాంపేయినింగ్ వ్యూహాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్! -
వారి వాగ్దానాలు నమ్మొద్దు
సాక్షి, పెద్దపల్లి: బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని ఆ పార్టీని ఓడించాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణచివేతకు గురైన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కాన్షీరాంఉద్యమం చేయడంతోనే ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయని గుర్తుచేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఘీంకార బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, దళితులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వారిని ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా అణచివేస్తోందని దుయ్యబట్టారు. 1989లో తాను తొలిసారి ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పానని, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచానన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుల అణచివేతలో భాగంగానే ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చి పేదలకు భూములు పంచి, లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అలాంటి పథకాలు అమలు చేసి బహుజనుల రాజ్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను ఓడించాలి: ప్రవీణ్ కుమార్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ను ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష, రామగుండం అభ్యర్థి అంబటి నరేశ్‌యాదవ్, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్‌లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్‌లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్‌కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్‌జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్‌గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
ముస్లింలను దళితులతో పోలిస్తే తప్పేంటి? రాహుల్‌కు మాయావతి మద్దతు
సాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్లో మద్దతు తెలిపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు ప్రస్తుత, గత ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అందులో తప్పేంటి? అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన "మొహబ్బత్ కీ దుకాన్" కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.1980ల్లో దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో అంతకంటే ఘోరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం సమర్ధించారు. ట్వీట్ సారాంశమేమిటంటే... " అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. కోట్లాది దళితులు, ముస్లింలు భారత దేశంలో దయనీయ స్థితిలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితికి గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ప్రభుత్వాలే బాధ్యత వహించాలి." "యూపీలో కానివ్వండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి. ఇప్పటికీ పేద, అణగారిన వర్గాల పట్ల అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మా హయాంలో మాత్రమే యూపీలో ప్రశాంతత నెలకొంది." కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లు, కులాల మధ్య కొట్లాటలను రెచ్చగొట్టి చరిత్రను ఎన్నో చీకటి అధ్యాయాలతో నింపేశారని రాశారు. చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు -
హైదరాబాద్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం.. మాయావతి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్‌లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్‌ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు. అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్‌కుమారే సీఎం తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు. బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. ‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు. -
అతిక్ సోదరుల దారుణ హత్య.. మాయవతి రియాక్షన్ ఇదే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేత, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిద్దరినీ ముగ్గురు యువకులు.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈఘటనపై తాజాగా బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. కాగా, మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గుజరాత్ జైలు నుండి తీసుకువచ్చిన అతీక్ అహ్మద్, బరేలీ జైలు నుండి తీసుకువచ్చిన అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో దారుణంగా కాల్చి చంపారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారికి చంపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఆందోళనకరమైన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా బై లా’ కాకుండా ఎన్కౌంటర్ ప్రదేశ్‌గా మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల సమక్షంలో ఇలా హత్యలు జరిగితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ ఘటనలో లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. -
‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్’
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ తీరుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో.. తల్లికూతుళ్లు మరణించిన ఘటనను ప్రస్తావించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తాజాగా యూపీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కంటే.. తల్లీకూతుళ్ల మరణం ఘటనే వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిందంటూ మండిపడ్డారామె. బీజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేదల ప్రాణాలు తీస్తున్నాయని, ఇది చాలా బాధకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందంటూ.. సోషల్ మీడియా వేదికగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. కాగా, బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి 'బుల్డోజర్ బాబాగా' ప్రజల నోళ్లల్లో నానుతుండటం గమనార్హం. 1. देश व खासकर उत्तर प्रदेश जैसे गरीबी, बेरोजगारी, महंगाई व पिछड़ेपन आदि से त्रस्त विशाल राज्य में भाजपा सरकार की लोगों को अति-लाचार एवं आतंकित करने वाली बुल्डोजर राजनीति से अब निर्दोष गरीबों की जान भी जाने लगी हैं, जो अति-दुखद व निन्दनीय। सरकार अपना जनविरोधी रवैया बदले। 1/2 — Mayawati (@Mayawati) February 15, 2023 (చదవండి: ఎవరైనా సీన్ క్రియేట్ చేస్తే నడుములు విరిగిపోతాయ్!: మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్) -
అఖిలేశ్, మాయవతిలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం!
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. అందులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్‌నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మను సైతం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర. గాజియాబాద్ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్‌పత్, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
Khelo India Youth Games 2022: మాయావతికి కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌లో గురువారం తెలంగాణకు 2 కాంస్యాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక కాంస్యం లభించాయి. బాలికల 200 మీటర్ల పరుగులో నకిరేకంటి మాయావతి కాంస్యం గెలుచుకుంది. 24.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో సుదేష్ణ (మహారాష్ట్ర–24.29 సె.), అవంతిక (మహారాష్ట్ర–24.75 సె.) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. బాలుర 200 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన అనికేత్ చౌదరి (22.27 సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఆర్యన్ కదమ్ (మహారాష్ట్ర–21.82 సె.), ఆర్యన్ ఎక్కా (ఒడిషా–22.10 సె.) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్. గాయత్రి కాంస్య పతకం గెలుచుకుంది. 81 ప్లస్ కేజీల కేటగిరీలో గాయత్రి 160 కిలోల బరువెత్తింది. ఈ విభాగంలో మార్టినా దేవి (మణిపూర్–186 కేజీలు), కె.ఒవియా (తమిళనాడు–164 కేజీలు) స్వర్ణం, రజతం సాధించారు. -
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేటుకుంది. అవినీతి సహా పలు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఆయనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాయని గురువారం విమర్శించారు. ఈ మేరకు వరుసగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘యూపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషపూరిత, ఉగ్రదాడులకు పాల్పడుతూ సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్‌ను రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచింది. ప్రజల దృష్టిలో ఇది న్యాయం గొంతు నొక్కడం కాకపోతే ఇంకేంటి?’ అని మాయావతి ప్రశ్నించారు. 88 కేసుల్లో బెయిల్ ఆజం ఖాన్ రెండేళ్లుగా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు పెట్టగా 88 కేసుల్లో బెయిల్ లభించింది. శత్రువుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో బుధవారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చివరి కేసులో కూడా బెయిల్ మంజూరయ్యాకే జైలు నుంచి ఆజం ఖాన్ విడుదల కానున్నారు. (క్లిక్: అనూహ్యం.. డీజీపీని తప్పించిన సీఎం యోగి) కూల్చివేతలు కరెక్ట్ కాదు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలను మాయావతి తప్పుబట్టారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో దురుద్దేశపూరితంగా ఆక్రమణల తొలగింపు పేరుతో వలస కార్మికులు, శ్రామిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ వారి జీవనోపాధిని లాగేసుకుంటున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు ఆందోళన కలిగిస్తోంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ‘అవార్డ్ వాపసీ’పై బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
రాహుల్... సొంతిల్లు దిద్దుకో: మాయావతి
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇతర పార్టీల గురించి ఆందోళన చెందడం మాని సొంత పార్టీని చక్కదిద్దుకోవాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి సలహా ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో మాయవతికి సీఎం పోస్ట్ ఇవ్వజూపినా పొత్తుకు ముందుకు రాలేదన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు. ‘‘రాహుల్ వ్యాఖ్యన్నీ అబద్ధాలు. అవి కులతత్వ మనస్తత్వాన్ని, దళితుల పట్ల దుర్గార్మపు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీని దిద్దుకోలేక రాహుల్ మాపై వేలెత్తి చూపుతున్నారు’’ అని మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీని సంప్రదించడం దానిపై మాయా మౌనం నిజమేనని కాంగ్రెస్ నేత ఖర్గే అన్నారు. చదవండి: (ప్రధాని మోదీ– జో బైడెన్ కీలక భేటీ) -
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
అధికార కేంద్రంలోనే పుట్టాను...కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ....."వారంతా అధికారం కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు. అధికారాన్ని పొందడం గురించే ఆలోచిస్తారు. నేను అధికార కేంద్రంలోనే పుట్టాను కానీ నాకు నిజాయితీగా దానిపై ఆసక్తి లేదు . నేను నా దేశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కీలక కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాతయ్య, నానమ్మ, తండ్రి కూడా ప్రధానులుగా సేవలందించిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రా కూడా భారత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నవారే. అంతేకాదు ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ యూపీ సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన బీఎస్సీ అధినేత్రి మాయవతి పై విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఎలాంటి ఎఫర్ట్ పెట్టి పనిచేయలేదని ఆరోపించారు. ఈసారి ఆమె దళితుల కోసం పోరాడలేదని విమర్శలు గుప్పించారు. (చదవండి: ఆప్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్ తీరువల్లే..) -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు? నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్‌లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్.. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ, ఎంఐఎం బీ టీమ్ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్‌లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్‌లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్‌వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
సీఎం చన్నీని పక్కన పెడతారు
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్‌జీత్ సింగ్ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్: పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా) బీఎస్పీ-ఎస్ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్‌లో బీఎస్పీ-ఎస్ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్బీర్ బాదల్‌ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్: పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!) -
మాయ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!
ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది. ►ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు. ►ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. ►1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్‌గా చేశారు ►దళిత నాయకుడు కాన్షీరామ్‌తో 1977లో పరిచయం ఏర్పడింది ►కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ►రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ►మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్‌సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు ►కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. ►1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ►ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు ►గురువు కాన్షీరామ్ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ►2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు ►ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్ హెరిటేజ్ కారిడార్‌లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ►ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ►2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది. ►ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్ కనిపించడం లేదు. ►అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. – నేషనల్ డెస్క్ సాక్షి -
Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!
మాయావతి గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణం కావొచ్చు’’ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓ వైపు పార్టీల్లో చేరికలు, మరోవైపు నేతల మాటల యుధ్ధాలు, ఇంకోవైపును ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటిస్తున్న హామీలతో ఎన్నికల కోలాహలం పెరిగినా.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఎక్కడా పెద్దగా కనబడకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిధ్దమవుతుండగా, పార్టీ ప్రచారాలకు మాయావతి గైర్హాజరు అవుతుండటం, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా, ఆమె మౌనం వీడకపోవడం పార్టీ క్రియాశీలక నేతలకు అంతుపట్టకుండా మారుతోంది. మాయావతి మౌనం నేపథ్యంలో ఆమెకు తొలినుంచి అండగా ఉంటూ వస్తున్న దళితవర్గాలు బీజేపీ, ఎస్పీ వైపుకు చూస్తుండటం ఆ పార్టీల గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ‘మాయ’ పనిచేయట్లేదా! బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగుమార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గానూ 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టు ఉంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకుపోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓటినప్పటికీ ఆమె వచ్చిన 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం19.3 శాతం ఓట్లనే రాబట్టుకుంది. అప్పటినుంచి పార్టీ కార్య్రమాలపై పెద్దగా ఆసక్తి చూపని మాయావతి ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ సమస్యలపై గొంతు విప్పుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దళితులు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మాయావతి మాత్రం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ పక్క పార్టీలకు మళ్లాయి. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో బీఎస్పీకి దళితులు దూరమయ్యారు. ఇదీగాక మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ కులాల భద్రత, నివాసం, ఉపాధికి పెద్దగా చేసిందేమీ లేదని, దళితులపై జరిగిన అఘాయిత్యాలను ఆపడంలో విఫలమయ్యారని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఎస్సీ వర్గాల్లో మాయావతి ప్రభ తగ్గిందని, అదీగాక ఆమె గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..) ఎవరికి కలిసొస్తుందో... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలహీనంగా కనబడుతుండటంతో దళిత వర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీలో పలుకుబడి గల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విభిన్న సంక్షేమ పథకాలను ముందుపెట్టి దళిత ఓట్లను ఆకర్షించడంతో పాటు వారిని హిందూత్వ గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. తిరిగి అదే స్థాయి సీట్లను రాబట్టుకునేందుకు దళిత కులాలన్నింటినీ కలుపుకుపోయే ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 75 జిల్లాల్లో దళితుల అభ్యున్నతికై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు పార్టీకి అదనపు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయనని, ఎస్సీ మేధావుల సమావేశాల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్ల సమీకరణ కోసం దళిత నాయకులను స్వాతగించిన అఖిలేశ్, వారిని రిజర్వ్డ్ స్థానాల్లో నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టడానికి తిరిగి అధికారంలోకి వస్తే, ఎస్సీ అధికారులే తన ప్రభుత్వాన్ని నడిపిస్తానని అనేకసార్లు ప్రైవేట్ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది బీఎస్పీ పార్టీ, ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఎస్పీలో చేరిపోయారు. వారిలో ఇంద్రజీత్ సరోజ్ కౌశాంబి, డాక్టర్ కేకే గౌతమ్, మిథాయ్లాల్ భారతి, త్రిభువన్ దత్తా, మహేష్ ఆర్య, సర్వేశ్ అంబేద్కర్, వీర్ సింగ్ జాతవ్, తిలక్ చంద్ర అహిర్వార్, ఫెరాన్ లాల్ అహిర్వార్, అనిల్ అహిర్వార్, విద్యా చౌదరి, రమేష్ గౌతమ్, యోగేష్ వర్మ వంటి వారున్నారు. గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన సీట్లు, ఓట్లు.. ఎన్నికలు గెలిచిన సీట్లు ఓట్ల శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 -
పోటీకి మాయావతి దూరం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు. -
Under 23 Athletics Championships: సత్తా చాటుతున్న మన అమ్మాయిలు
న్యూఢిల్లీ: జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య గాంధె, నకిరేకంటి మాయావతి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 100 మీటర్ల హీట్స్‌లో నిత్య 11.91 సెకన్లతో రెండో స్థానంలో, మాయావతి 12.40 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. రెండు హీట్స్‌లో అత్యుత్తమ సమయం నమోదు చేసిన ఎనిమిది మందికి ఫైనల్ బెర్త్ లభించింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్లో తెలంగాణకు చెందిన భాగ్యలక్ష్మి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో నక్కా రాజేశ్ (ఆంధ్రప్రదేశ్), 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ఫైనల్ చేరారు. చదవండి: Vennam Jyothi Surekha: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. ఏకంగా -
‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్లు ఇవ్వం’
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్ఐ నివేదించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు) 1. बीएसपी का अगामी यूपी विधानसभा आमचुनाव में प्रयास होगा कि किसी भी बाहुबली व माफिया आदि को पार्टी से चुनाव न लड़ाया जाए। इसके मद्देनजर ही आजमगढ़ मण्डल की मऊ विधानसभा सीट से अब मुख्तार अंसारी का नहीं बल्कि यूपी के बीएसपी स्टेट अध्यक्ष श्री भीम राजभर के नाम को फाइनल किया गया है। — Mayawati (@Mayawati) September 10, 2021 దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్పీ కృషి చేస్తుంది. బీఎస్పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. 2. जनता की कसौटी व उनकी उम्मीदों पर खरा उतरने के प्रयासों के तहत ही लिए गए इस निर्णय के फलस्वरूप पार्टी प्रभारियों से अपील है कि वे पार्टी उम्मीदवारों का चयन करते समय इस बात का खास ध्यान रखें ताकि सरकार बनने पर ऐसे तत्वों के विरूद्ध सख्त कार्रवाई करने में कोई भी दिक्कत न हो। — Mayawati (@Mayawati) September 10, 2021 చదవండి: బుజ్జగింపులో వింత కోణం -
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
బీఎస్పీ తదుపరి చీఫ్ దళిత వర్గం నుంచే..
లక్నో: ‘నేనిప్పుడు ఫిట్‌గానే ఉన్నాను. అన్‌ఫిట్‌గా మారడానికి ఇంకా చాలా సంవత్సాలు పడుతుంది. కాబట్టి నా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తిని ఇప్పుడే ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దళిత వర్గం నుంచే ఎంపిక ఉంటుంది’ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సతీశ్ మిశ్రా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా కరోనా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడే పార్టీ పగ్గాలను వేరేవారికి అప్పగిస్తానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో పార్టీతో ఉన్న వారికే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం కూడా తన ఆరోగ్యం క్షీణించాకే తదుపరి చీఫ్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 24 పేజీల బుక్లెట్ గురించి ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు, ఆహారం ఎరగా వేసి ప్రజలను రప్పిస్తుందని విమర్శించారు. ప్రజల మద్దతును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాంపెయిన్‌కోసం పారిశ్రామి కవేత్తలపై ఆధారపడుతోందని, కానీ బీఎస్పీ మాత్రం ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి కూడా టికెట్లు ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌లా తమ పార్టీ పెట్టుబడిదారుల పార్టీ కాదని పేదలు, అణగారిన వారి పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహరించే రెండు నాల్కల ధోరణి వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. -
ఉగ్రవాద కుట్ర నిజమైతే.. రాజకీయాలు చేయొద్దు: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మోసానికి చిరునామా! : మాయావతి
కాంగ్రెస్ మోసానికి చిరునామా! కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి చిరునామా అని బీఎస్పీ నేత మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో మాయావతి రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘బీఎస్పీలో బీ అంటే బీజేపీ’’ అని యూపీ కాంగ్రెస్ ఒక ట్వీట్లో విమర్శించింది. దీనిపై మాయావతి పలు ట్వీట్లతో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు యూపీలో అడ్రస్ లేదని, కాంగ్రెస్ విమర్శలు అభ్యంతర కరమని, బీఎస్పీలో బీ అంటే బహుజనులని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో సీ అంటేనే కన్నింగ్ అని విమర్శించారు. బహుజనుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం వారిని వదిలేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అయితే బీజేపీకి బీఎస్పీ బీటీమ్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసని, ఇప్పటికైనా మాయావతి నిజాలను ఒప్పుకోవాలని యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ ఎద్దేవా చేశారు. బీజేపీ– శివ సేన శత్రువులు కావు! కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలున్నంత మాత్రాన తమ పార్టీ, తమ మాజీ నేస్తం శివసేన శత్రువులు కావని బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావీస్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అది జరగవచ్చు, ఇది జరగకూడదని లేదన్నారు. భవిష్యత్‌లో ఇరువురూ మరలా కలుస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, సరైన సమయంలో, పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలుంటాయన్నారు. 2019 ఎన్నికల్లో తమతో కలిసే సేన పోటీ చేసిందని, కానీ ఫలితాల అనంతరం వేరేవారితో(ఎన్సీపీ, కాంగ్రెస్) చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. ఎవరిపైన పోటీ పడిందో వారితోనే సేన జట్టుకట్టిందని రాష్ట్ర అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో పలు కేసులను దర్యాప్తు చేస్తున్నాయని, వీటిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. ఒవైసీ సవాలుకు మేము సిద్ధం: యోగి ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయబోమంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనీ, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. ‘ఒవైసీ ప్రముఖ జాతీయ నేత. ఆయన దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆయనకు సొంత ఆదరణ ఉంది. బీజేపీని ఆయన సవాల్ చేస్తే స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుంది. దీనిపై సందేహమే లేదు’అని ఆయన అన్నారు. అంతకు ముందు ఒవైసీ ‘యూపీలో మరోసారి యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం కానివ్వబోం. మేం కష్టపడితే, ప్రతి ఒక్కటీ సాధ్యమే. మా ప్రయత్నం సఫలమైతే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు’అని అన్నట్లు వార్తలొచ్చాయి. రఫేల్ డీల్‌పై రాహుల్ విమర్శలు రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలంటూ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ..ఆదివారం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ ఆపార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్లో సర్వే చేపట్టారు. ఈ ప్రశ్నకు రాహుల్ నాలుగు ఆప్షన్లు ఉంచారు. వాళ్లకు కమీషన్ అందలేదనే.. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. భారత వైమానిక దళం బలం క్షీణించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల అవసరాలకు అనుగుణంగా విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఆశించినంత మేర కమీషన్ గాంధీ కుటుంబానికి అందకపోవడమే కారణమా? అని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర నిలదీశారు. -
BSP: మాయావతి కీలక నిర్ణయం
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు... యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ట్విటర్ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్‌లను ఎన్నుకోనున్నారు. చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ -
యూపీలో ఒంటరిగానే పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, అసదుద్దీన్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్‌ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తో ఇటీవల బీఎస్పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే. యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు. -
ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు
లక్నో: తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. అయితే ఎంఐఎం.. బహుజన్ సమాజ్ పార్టీతో జంటగా బరిలోకి దిగబోతుందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ఎంఐఎంతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. (చదవండి: మాయావతిపై డర్టీ కామెంట్లు) ‘‘విధాన సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పొత్తు ఉంటుందని కథనాలు ప్రసారం చేస్తున్నారు. అది నిరాధారమైన వార్త అది. నిజం కాదు. ఖండిస్తున్నాం’’ అని ట్విటర్ ద్వారా ప్రకటించారమె. అంతేకాదు ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే పంజాబ్‌లో మాత్రం అకాళీదల్‌తో పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ తప్ప వేరే ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవు. ఇది ఫైనల్ అండ్ క్లియర్.. అని స్పష్టం చేశారామె. 1. मीडिया के एक न्यूज चैनल में कल से यह खबर प्रसारित की जा रही है कि यूपी में आगामी विधानसभा आमचुनाव औवेसी की पार्टी AIMIM व बीएसपी मिलकर लड़ेगी। यह खबर पूर्णतः गलत, भ्रामक व तथ्यहीन है। इसमें रत्तीभर भी सच्चाई नहीं है तथा बीएसपी इसका जोरदार खण्डन करती है। 1/2 — Mayawati (@Mayawati) June 27, 2021 తప్పుడు ప్రచారాలు ఆపండి.. బీఎస్పీ పార్టీపై వరుసగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై యూపీ మాజీ సీఎం మాయావతి మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు విషయంతో పాటు రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర గురించి ఫేక్ కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారాలు ఆపండి అంటూ మీడియాను ఆమె కోరారు. ఏదైనా ప్రసారం చేసే ముందు బీఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని.. ఇలాంటివి రిపీట్ అయితే పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. చదవండి: ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌కు బానిసగా ఉంటారు -
ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అపుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీఎన్నికలకుముందు బీఎస్పీ అధినేత మాయావతికి భారీ ఎదురు దెబ్బ తగల నుందా? పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో లక్నోలో భేటీ పలు ఊహాగానాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్‌వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్) అఖిలేష్‌లను కలిశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి. కాగా 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్దమవుతోంది. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు, లాల్జీ వర్మ, రామ్ అచల్ సహా మొత్తం 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2019లో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ఇపుడు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు -
పంజాబ్‌లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్ -
డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్‌దీప్ హుడా
ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో రణ్‌దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్‌గా పేరున్న రణ్‌దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్‌దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం. డర్టీ కామెంట్లు గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్‌దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్‌దీప్‌పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్‌దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రణ్‌దీప్‌కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్‌దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
బీఎస్పీ సీటు దక్కలేదన్న మనస్తాపంతో..
లక్నో : బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) సీటు దక్క లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాపూర్‌కు చెందిన మున్ను ప్రసాద్ అనే వర్తకుడు గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో పని చేస్తున్నాడు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పార్టీ అధ్యక్షురాలు మాయావతి అతడి వద్దనుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ( ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత ) ఆమె అడిగిన మొత్తం ఇవ్వలేని స్థితిలో ఉన్న తనకు ఆత్మహత్యే శరణ్యమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై బీఎస్పీ కోఆర్డినేటర్ గుడ్డు రామ్ మాట్లాడుతూ.. మున్ను ప్రసాద్‌కు పార్టీతో సంబంధం లేదని, సూసైడ్ నోట్ పార్టీ పేరును దిగజార్చేలా ఉందని అన్నారు. అయితే మున్ను బీఎస్పీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని, తనకు మాయావతి కచ్చితంగా సీటు ఇస్తుందనే వాడని స్థానికులు చెబుతున్నారు. -
అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి
లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులును ఓడించడానికి కృషి చేస్తామని.. అందుకు అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేస్తామంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన ప్రకటన చేశారు. గతేడాది సార్వత్రి ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వీరు తర్వత బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్ 2 కేసును విత్‌డ్రా చేసుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా వర్ణించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం’ అంటూ మాయావతి సంచలన ప్రకటన చేశారు. (చదవండి: ప్రియాంకపై మాయావతి ఫైర్) 1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామని, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్‌వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. (చదవండి: బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై! ) ఇక యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మాయావతి ఈ సచంలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిటర్నింగ్ అధికారిని కలిసిన కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాయావతి పై ప్రకటన చేశారు. -
బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రతిపక్ష బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో మంటలు రాజేస్తున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరబోతున్నామంటూ సంకేతాలిచ్చారు. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్ బజాజ్ అనే పారిశ్రామికవేత్త స్వతంత్ర అభ్యర్థిగా చివరి నిమిషంలో పోటీకి దిగారని, ఆయనను గెలిపించేందుకు తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కొనేశారని బీఎస్పీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ ఆరోపించారు. -
యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్‌రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వస్థలమైన గోరఖ్‌పూర్ మఠానికి యోగిని పంపించాలని మాయావతి వ్యాఖ్యానించారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావతి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్‌రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్ వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి
లక్నో: యూపీలో బ్రాహ్మణులు, దళితులు, ముస్లిములను టార్గెట్ చేశారని(లక్ష్యంగా చేసుకోవడం) బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత మాయావతి తెలిపారు. శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడారు. యూపీలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం దళితుల పై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తుందని విమర్శించారు. అయితే గతంలో పాలించిన ఎస్పీ(సమాజ్ వాదీ) ప్రభుత్వంలో బ్రాహ్మణులు, దళితులు వివక్షకు గురయ్యారని మండిపడ్డారు కాగా ఎస్పీ పాలనలో దిగ్గజ నాయకుల విగ్రహాలు ధ్వంసమయ్యావని, జిల్లాలు, సంస్థల పేర్లు (దళిత చిహ్నాలు) ఎస్పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ధ్వజమెత్తారు. మరోవైపు వారనాసి, జౌన్పూర్ ప్రాంతాలలో సంఘటనలను ఆమె విమర్శించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. -
కేంద్రంపై మాయావతి ప్రశంసలు
లక్నో : అన్‌లాక్-4లో భాగంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇవి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికీ సర్వజన సమ్మతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోవిడ్19 పోరులో భాగంగా అన్‌లాక్‌కు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకీకృతంగా ఉన్నాయి. వాటిని స్వాగతిస్తున్నాం. బీఎస్పీ చాన్నాళ్లుగా ఈ డిమాండే చేస్తోంది. కరోనా ముసుగులో రాజకీయాలు చేయడం తగదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. కేంద్రం తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సైతం అందుతాయి' అంటూ మాయావతి పేర్కొన్నారు. (అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ) కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్‌లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. (అన్‌లాక్ 4: 7 నుంచి మెట్రో..) -
‘యూపీ సర్కార్ రామరాజ్య సూత్రాలను పాటించడం లేదు’
లక్నో: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రామరాజ్య సూత్రాలను పాటించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి శనివారం విమర్శించారు. మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ కులతత్వ రాజకీయాల వల్ల బ్రాహ్మణులు బీఎస్పీలో చేరుతున్నారని తెలిపారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు 2022సంవత్సరంలో జరగనున్న విషయం తెలిసిందే. కాగా బ్రాహ్మణులను బీఎస్పీ పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించడంపై మాయావతి స్పందిస్తూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ప్రాముఖ్యత కలిగిన మంత్రిత్వ శాఖలను బీఎస్పీ కేటాయించిందని గుర్తు చేశారు. కాగా, బ్రాహ్మణ సమాజం అర్థం లేని ఆరోపణలను నమ్మరని తెలిపారు. కాగా మాయావతి 2007 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల గెలుపు వ్యూహాన్నే అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. యూపీలో 11శాతం బ్రాహ్మణుల జనాభా ఉంది. పార్టీల గెలుపోటమలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా 2017అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ హిందుత్వ నినాదంతో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 312స్థానాలను కైవసం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం పది స్థానాలతో దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. చదవండి: ఇంటర్నెట్ సెలబ్రిటిగా సీఎం పెంపుడు కుక్క -
భూమిపూజ : రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది
లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు -
‘ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు’
జైపూర్: బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్‌ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. చదవండి: మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్ -
మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను కోరుతూ పార్టీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర వేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడా, వాజిబ్ అలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్‌లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. విప్‌ను ధిక్కరిస్తే వారు అనర్హత వేటుకు గురవుతారని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా హెచ్చరించారు. బీఎస్పీ జాతీయ పార్టీ అని, జాతీయస్ధాయిలో బీఎస్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే మినహా రాష్ట్రస్ధాయిలో ఆరుగురు ఎమ్మెల్యేల విలీనం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. చదవండి : రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి.. అందుకే రాష్ట్రస్ధాయిలో తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కావడం చెల్లుబాటుకాదని వివరించారు. 2016లో పాలక టీఆర్ఎస్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది పాలక పార్టీలో విలీనమైన కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మిశ్రా వాదనను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. వారు సాంకేతికంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కానందున వారికి విప్ వర్తించదని గహ్లోత్ శిబిరం వాదిస్తోంది. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనానికి స్పీకర్ ఆమోదాన్ని సవాల్ చేస్తూ బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే న్యాయస్ధానాలను ఆశ్రయించాయి . ఇక సచిన్ పైలట్ తిరుగుబాటుతో 19 మంది ఎమ్మెల్యేలు దూరమవడంతో గహ్లాత్ సర్కార్ మైనారిటీలో పడిందని రెబల్ నేతలు చెబుతుండగా 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో తమకు 103 మంది ఎమ్మెల్యేల బలముందని గహ్లోత్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ 103 మందిలో బీఎస్పీ నుంచి చేరిన 6 ఎమ్మెల్యేలున్నారు. -
‘రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి’
న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’) -
వికాస్ దూబే మృతి : విచారణకు మాయావతి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్ ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్ధానం పర్యవేక్షణలో పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ఆమె కోరారు. కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ బృందం కాల్చిచంపిన క్రమంలో వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా మొత్తం వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణ చేపట్టాలని మాయావతి డిమాండ్ చేశారు. సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకువస్తుందని, దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతోనే యూపీ నేరరహిత రాష్ట్రంగా మారుతుందని ఆమె ట్వీట్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను శుక్రవారం ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. చదవండి : ‘వికాస్ దూబే హతం : మాకు పండుగ రోజే’ -
కేంద్రం జోక్యాన్ని కోరిన మాయావతి
లక్నో: ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి కోరారు. దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో ఢిల్లీయేతరులకు చికిత్స అందించకూడదని హస్తిన సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దేశానికి ఢిల్లీ రాజధాని. ముఖ్యమైన పనుల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారు ఢిల్లీవాసులు కాదన్న కారణంతో చికిత్స చేసేందుకు నిరాకరించడం సరైంది కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల’ని మాయావతి ట్వీట్ చేశారు. (ఢిల్లీ ఆసుపత్రుల్లో 'ఇతరులకు' నో ఛాన్స్!) లాక్‌డౌన్‌ను సడలించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా, ఢిల్లీలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదని, 90 శాతం పడకలు స్థానికులకే కేటాయించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) వివక్ష ఎందుకు?: సీఎం చౌహాన్ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆక్షేపించారు. ‘కేజ్రీవాల్ జీ పేరులో 'వాల్ (ఎల్)' ఉంది. అందుకని ఆయన దాన్ని నిర్మిస్తారా? అలాంటి వివక్ష ఎందుకు?’ అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. ఢిల్లీయేతరులకు చికిత్స నిరాకరించడం సిగ్గుచేటని హస్తిన బీజేపీ నాయకుడు మనోజ్ తివారి అంతకుముందు విమర్శించారు. కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిస్సహాయంగా మారిందని దుయ్యబట్టారు. -
జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై స్పందించిన మాయావతి
లక్నో: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ ఘటనపై చెలరేగే ఆందోళనలు ప్రపంచంలో సామాన్యుడి జీవితానికి విలువ ఉందని తేలియజేసున్నాయని అన్నారు. అయితే భారత రాజ్యాంగం కూడా సామాన్య ప్రజలకు చాలా హామీలు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో దేశంలో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజలకు స్వాతంత్య్రం, భద్రత, ఆత్మగౌవరం వంటి హామీలను ఇచ్చిందని వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. (ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు) మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికీ పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ఆగ్ర రాజ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
ప్రతిపక్షాల భేటీ: ‘హ్యాండిచ్చిన’ ఆ ముగ్గురు!
న్యూఢిల్లీ: వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌ను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించినట్లు తెలుస్తోంది. రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీతో తమకు ఉన్న విభేదాల నేపథ్యంలో వీరు ఈ మేరకు కాన్ఫరెన్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల వలస కూలీలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉన్నచోట ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లే మార్గం తెలియక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వారి కష్టాలు తీరడం లేదు. (వలస కూలీలపై భారం మోపుతారా’) ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా వామపక్ష నేతలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. -
ఔరాయ ప్రమాదానికి కారణం వారే: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్‌పూర్ ట్రక్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') -
‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా..
లక్నో: లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. లక్షలాది మంది పేద వలస కార్మికులు మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఉపాధి కోల్పోయి తిండిలేక వలస కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా వారికి ఆహారం దొరకడం లేదు. వారంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. కేంద్రం సానుభూతితో వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకుని వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి విద్యార్థులను సొంతూళ్లకు తరలించినట్టుగానే ప్రత్యేక బస్సుల్లో బడుగులను తరలించాలి. లేదంటే ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను పంపించాల’ని మాయావతి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత -
లాక్డౌన్ కష్టాలు: మండిపడ్డ మాయావతి
లక్నో: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస జీవుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కరోనా(కోవిడ్-19) మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో దళితులు, ఆదివాసీల పరిస్థితి దయనీయంగా మారిందని.. అయినా వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. కరోనాను కట్టడి చేసేందు మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మాయావతి మాట్లాడుతూ... ప్రభుత్వాలు వలస జీవులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.(ఆ విషయాన్ని రేపు ప్రధాని వెల్లడిస్తారు: జవదేకర్) ‘‘పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో 90 శాతం మంది దళితులు, ఆదివాసీలే... 10 శాతం పేదలు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో స్వస్థలాలకు పయనమైన వారికి యజమానులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు... కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. వారిని ఆపడం లేదు. కనీసం నిత్యావసరాలు తీర్చే చర్యలు చేపట్టడం లేదు. వారిని సొంత ఊళ్లకు చేర్చే మార్గాలు అన్వేషించడం లేదు. అందుకే కాలినడకన స్వస్థలాలకు పయనమై ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నామ మాత్రంగా కొన్ని బస్సులు, ట్రక్కులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. కొన్నిచోట్ల వెనక్కి పంపిస్తున్నారు. ఒకవేళ వారిలో ఎవరికైనా మహమ్మారి సోకి ఉంటే పరిస్థితి ఏంటి’’అని మాయావతి ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు) -
ప్రియాంకపై మాయావతి ఫైర్
లక్నో : సామాజికవేత్త, కవి రవిదాస్‌ను అధికారంలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ గౌరవించలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆలయ సందర్శనలను మాయావతి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో రవిదాస్‌కు తాము అత్యంత గౌరవం ఇచ్చామని మాయావతి చెప్పుకొచ్చారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే బదోహి జిల్లాను తిరిగి సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు. ఎస్పీ ప్రభుత్వం గతంలో కుల కోణంలోనే రవిదాస్ నగర్ జిల్లా పేరును తొలగించిందని ఆమె మండిపడ్డారు. 1994లో వారణాసి జిల్లా నుంచి వేరుపరుస్తూ బీఎస్పీ హయాంలో సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఏర్పడగా 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఆ జిల్లా పేరును బదోహిగా మార్చింది. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు అధికారంలో ఉండగా సంత్ గురు రవిదాస్‌ను పట్టించుకోకుండా, విపక్షంలో ఉన్నప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నాయని మాయావతి ట్వీట్ చేశారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్న క్రమంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి : మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన -
జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..!
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చోటుచేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాత్మక దాడులను ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు. ‘విద్యార్థులపై జరిగిన భీకరమైన దాడి.. అసహనానికి నిదర్శనం. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, టీచర్లపై ‘నాజీ స్టైల్’లో దాడి జరిగింది. దేశంలో హింస, అశాంతి సృష్టించాలనుకునేవాళ్లే ఇలాంటి దాడులు చేస్తారు’ అని పినరయి ట్విటర్లో పేర్కొన్నారు. ‘క్యాంపస్‌లో రక్తపాతాలు సృష్టించే ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడటాన్ని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పటికైనా ఆపాలి. విద్యార్థుల గొంతు.. ఈ దేశ గొంతుగా వారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’ అని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడుల నేపథ్యంలో క్యాంపస్ విద్యార్థులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందుకే వారిని ‘శిక్షించేందుకు’ ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్‌యూలో దాడులను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపితే మంచిదని ఆమె సూచించారు. -
సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి
లక్నో : జేఎన్‌యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని ఖండించిన మాయావతి సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జేఎన్‌యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి సిగ్గుచేటు. తీవ్రంగా ఖండించదగినది. ఈ పాశవిక చర్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి.. దాడిపై న్యాయ విచారణ జరిపితే మంచిది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.(జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్ తారలు) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి ఆదివారం రాత్రి చొరబడిన దుండగులు విద్యార్థులపై కర్రలతో, రాడ్లతో దాడిగి తెగబడిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ముసుగు దాడిలో గాయపడ్డ విద్యార్థులు, జేఎన్యూఎస్ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనను ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ తక్షణమే యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా ఏబీవీపీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. చదవండి. ‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ JNU में छात्रों व शिक्षकों के साथ हुई हिंसा अति-निन्दनीय व शर्मनाक। केन्द्र सरकार को इस घटना को अति-गम्भीरता से लेना चाहिये। साथ ही इस घटना की न्यायिक जाँच हो जाये तो यह बेहतर होगा। — Mayawati (@Mayawati) January 6, 2020 -
ఇప్పుడు కూడా ఆయనను కౌగిలించుకుంటారా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని నంకానా గురుద్వారా సాహిబ్ వద్ద శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. సిక్కు యువతి జగ్జీత్కౌర్ను అపహరించి, మతమార్పిడికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయంపై స్పందించిన మీనాక్షి లేఖి.. కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. ‘ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్ సింగ్ ఐఎస్ఐ చీఫ్‌ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు. సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్‌ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మస్థానమైన నంకానా సాహిబ్ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్ దేవ్ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా విఙ్ఞప్తి చేశారు. -
మాయావతి అనూహ్య విమర్శలు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కోటాలో 100మందికిపైగా చిన్నారులు మృతి చెందిన ఉదంతంలో ప్రియాంకగాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కోటాలో చిన్నారుల మరణాలపై రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ మొద్దు నిద్ర నటిస్తోందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాయావతి ట్విటర్లో మండిపడ్డారు. ఇది తీవ్ర ఖండనార్హమని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధినాయకత్వం, ముఖ్యంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఈ విషయమై మౌనంగా ఉండటం మరింత ఖండనీయమైన అంశమన్నారు. యూపీలో సీఏఏ అల్లర్లలో బాధితుల కుటుంబసభ్యులను కలుస్తున్న మాదిరిగానే కోటాలో పిల్లలను కోల్పోయిన నిరుపేద తల్లులను కలిస్తే బాగుండేది’ అని ఆమె ట్విటర్లో అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే కోటాలో చిన్నారులు చనిపోయారని ఆమె ఆరోపించారు. కోటాలోని బాధితులను కూడా ప్రియాంకగాంధీ పరామర్శించి ఉంటే.. యూపీలో ఆమె పరామర్శ యాత్రలను రాజకీయ అవసరంగా పరిగణించి ఉండేవారు కాదని ఆమె పేర్కొన్నారు. కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత కొద్దిరోజుల్లో 100దాకా నవజాత శిశువులు చనిపోయారని కథనాలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక, ప్రియాంక నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలపడితే.. అది తన ఓటుబ్యాంకును దెబ్బతీసే అవకాశముందనే భయంతోనే మాయావతి ఇటీవలికాలంలో ప్రియాంకను తీవ్రంగా విమర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి
లక్నో : కాంగ్రెస్ పార్టీ దంద్వ వైఖరిపై బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిచ్చిన శివసేనతో కాంగ్రెస్ దోస్తీ ఎలాంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకుంటూనే రాహుల్ వీర సావర్కర్ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టడుతోందని అన్నారు. కాగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం జరిగిన ‘భారత్ బచోవో ర్యాలీ’లో రాహుల్ గాంధీ ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన సావర్కర్‌ను అందరూ గౌరవించాలని స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్ వ్యతిరేకించిన పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన మద్దతు పలికింది. ఇప్పుడు అదే శివసేన రాహుల్ గాంధీ సావర్కర్ వ్యాఖ్యలను తప్పుబడుతోంది. మళ్లీ మహారాష్ట్రలో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ దంద్వ విధానాలకు నిదర్శనం’ అని మాయావతి ట్విటర్లో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు నాటుకాలు ఆడుతోందని ప్రజలు భావిస్తారని అన్నారు.