Sakshi News home page

‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ‍ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’

Published Thu, Dec 28 2023 5:28 PM

MP Malook Nagar Says Declare Mayawati PM candidate For Entry In INDIA Bloc - Sakshi

రాబోయే 2024 పార్లమెంట్‌ సార్వత్రిక ఎ‍న్నికల్లో బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్‌నగర్‌ డిమాండ్‌ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్‌పీ చీఫ్‌ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు.  కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు మాలూక్‌నగర్‌.  అలా అయితే  ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం  వహిస్తున్న వారిలో మాయావతికి  ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్‌ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు.

తమకు ఉత్తరప్రదేశ్‌లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎ‍స్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్‌ నగర్‌ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్‌ యాదవ్‌ అసంతృప్తిగా ఉ‍న్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 

చదవండి:  ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..

Advertisement
Advertisement