ఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై ఇటీవల ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను తొలగించటం ఇష్టం లేకనే తాను పార్టీ మారినట్లు చెప్పారు.
‘దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని, నిజాయితిగా సేవ చేసే నాయకులను తొలగించాలని కాంగ్రెస్ ఆదేశించింది. కానీ, నేను అలా చేయలేకపోయా. ఒక పార్టీ అనేది ఎప్పుడు అసంతృప్త నేతలకు చేరుకోవాలి. కానీ, ఎప్పుడు వారిని దూరం చేసుకోవద్దు. ఢిల్లీలో కూటమిలో భాగంగా ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
అయితే మొత్తం ఏడు స్థానాల్లో ఒక్క చోట కూడా కాంగ్రెస్ నేతల పోస్టర్లు లేవు. అదే విధంగా ఆప్ తాను పోటి చేస్తున్న నాలుగు స్థానాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పోస్టర్లు వినియోగించటం లేదు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు పొత్తు సంప్రదింపుల సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా’ అని అరవిందర్ సింగ్ తెలిపారు. ఇటీవల అరవింద్ సింగ్ ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment