Arvinder Singh Lovely
-
ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై ఇటీవల ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను తొలగించటం ఇష్టం లేకనే తాను పార్టీ మారినట్లు చెప్పారు.‘దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని, నిజాయితిగా సేవ చేసే నాయకులను తొలగించాలని కాంగ్రెస్ ఆదేశించింది. కానీ, నేను అలా చేయలేకపోయా. ఒక పార్టీ అనేది ఎప్పుడు అసంతృప్త నేతలకు చేరుకోవాలి. కానీ, ఎప్పుడు వారిని దూరం చేసుకోవద్దు. ఢిల్లీలో కూటమిలో భాగంగా ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే మొత్తం ఏడు స్థానాల్లో ఒక్క చోట కూడా కాంగ్రెస్ నేతల పోస్టర్లు లేవు. అదే విధంగా ఆప్ తాను పోటి చేస్తున్న నాలుగు స్థానాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పోస్టర్లు వినియోగించటం లేదు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు పొత్తు సంప్రదింపుల సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా’ అని అరవిందర్ సింగ్ తెలిపారు. ఇటీవల అరవింద్ సింగ్ ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
రాహుల్ చక్రం.. తిరిగి కాంగ్రెస్ గూటికి..
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవలీ తిరిగి సొంత పార్టీ గూటికి చేరారు. దాదాపు తొమ్మిది నెలల కిందట బీజేపీలో చేరేందుకు వెళ్లిన ఆయన తిరిగి బీజేపీతో తనకు సరిపడదని పేర్కొంటూ కాంగ్రెస్ లోకే వచ్చారు. 'సిద్ధాంతాలపరంగా నాకు బీజేపీకి సరిపడదు. నా కుటుంబ పార్టీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది' అని లవ్లీ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు చెప్పారు. కాగా లవలీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని ఢిల్లీ ఏఐసీసీ ఇంచార్జ్ పీసీ చాకో, మాకెన్ స్వాగతించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన షీలా దీక్షిత్‌కు అరవిందర్ సింగ్ చాలా సన్నిహితుడని పేరుంది. ఆమె ప్రభుత్వంలో పలు బాధ్యతలను అతడు నిర్వహించాడు. నాలుగుసార్లు ఇప్పటికే ఢిల్లీ ఎమ్మెల్యేగా పనిచేసిన అరవింద్ తొలిసారి 1998లో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అరవింద్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం వెనుక రాహుల్‌గాంధీ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. -
కాంగ్రెస్ పార్టీకి ఆమె ఓ గుదిబండ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఓ గుదిబండ అని బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ మాలిక్‌తో కలిసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి షీలా దీక్షిత్ పూర్తిగా పక్కకు తప్పుకొని కాంగ్రెస్‌కు భారంగా మారారు. నేను సైనికుల అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తున్న బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నాను. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఆయన సుభిక్షంగా ఉండేందుకు ప్రాముఖ్యతనిస్తారు. కష్టపడేందుకు అస్సలు ఇష్టపడరు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మురిగి వాడల్లో రాత్రంతా గడుపుతున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకెన్ మాత్రం లోది గార్గెన్‌లో ప్రచారం చేసి వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచింది. బీజేపీ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. నరేంద్రమోదీ, అమిత్ షా నాయకత్వంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెబుతోంది’ అని ఆయన అన్నారు. -
కాంగ్రెస్‌కు మరో నాయకుడి షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అర్వీందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో లవ్లీ ప్రముఖ నాయకుడు. షీలా దీక్షిత్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. లవ్లీ బీజేపీలో చేరడం దురదృష్టకరమని షీలా అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి వెళ్లే నాయకులను ఎవరు నమ్ముతారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌కు నాయకులతో సఖ్యతగా ఉంటూ వారిని కాపాడుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే పార్టీని వీడుతున్నారని షీలా అన్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో లవ్లీ అసంతృప్తి చెందారని సమాచారం. ఎంసీడీ టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని ఇటీవల ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే వాలియా కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. -
బీజేపీలో చేరిన లవ్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ హోం మంత్రి బూటా సింగ్ తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీ తన మద్దతుదారులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు నచ్చి బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లవ్లీకి టిక్కెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఆయన బీజేపీ చేరారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2008లో దియోలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అర్విందర్ సింగ్, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. -
అనధికార కాలనీ వాసులను పెడదారి పట్టిస్తున్నాయి
న్యూఢిల్లీ: అనధికార కాలనీల్లో నివసించేవారిని బీజేపీ, ఆప్... తప్పుదారి పట్టిస్తున్నాయని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. బదర్పూర్లో సోమవారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కాలనీల్లో నివసించేవారు ఆ రెండు పార్టీల వలలో చిక్కుకుపోయేందుకు అంగీకరించబోమన్నారు. ఈ కాలనీల్లో నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంటోందన్నారు. ఈ కాలనీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అయితే గత ఏడాదికాలంగా అటువంటిదేమీ జరగడం లేదన్నారు. తప్పుడు వాగ్దానాలు, అబద్ధాల ద్వారా ఈ కాలనీల్లో నివసించేవారిని బుట్టలో వేసుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎంసీడీల్లో అవినీతి జోరు: బీజేపీ నేతృత్వంలోని నగర పాలక సంస్థల్లో అవినీతికి అడ్డూఅదుపు లేదని లవ్లీ ఆరోపించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రతతో కళకళలాడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని, అయితే ఈ మూడు కార్పొరేషన్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోందన్నారు. నగరంలో అభివృద్ధి జరగాలంటే ఈసారి జరిగే ఎన్నికల్లో స్థానికులంతా తమ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. -
తొందరపడ్తున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తేదీ ప్రకటించలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తానని కాంగ్రెస్ చెబుతోంది. సోమవారం లేదా మంగళవారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని, దానితో ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారో స్పష్టమవుతుందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. ఈసారి ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడం కోసం ప్రజలకు సుపరిచితులైన పలువురు ప్రముఖ నేతలను ఎన్నికల బరిలోకి దింపాలని ఢిల్లీ కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో ఈ నేతలు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కొత్తవారికి టికెట్ ఇచ్చే బదులు పాతవారికే ఇచ్చినట్లయితే విజయావకాశాలు అధికంగా ఉంటాయని, వారితో అసెంబ్లీలో తన సంఖ్యాబలం మెరుగుపడ్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే ప్రకటించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. దానివల్ల అభ్యర్థులకు ఎక్కువ ప్రచార సమయం లభిస్తుందని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఒకటి రెండు రోజులలో ఆరంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం దరఖాస్తుల ఫారాలను ఖరారు చేస్తున్నారు. వాటిలో టికెట్ ఆశిస్తున్న వారి పేరు, చిరునామా, పార్టీకి అందించిన సేవలతో పాటు వారిపైనున్న కేసులను గూర్చిన వివరాలను అడగనున్నారు. దరఖాస్తు పత్రాలతో పాటు కొంత రుసుమును కూడా వసూలు చేస్తే ఎలా ఉంటుందని పార్టీ యోచిస్తోంది. పార్టీ అధికారంలో లేనందువల్ల నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించడం కోసం దరఖాస్తుదారుల నుంచి కొత రుసుము వసూలు చేయాలని అనుకుంటన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 1993 ఎన్నికలలో కూడా దరఖాస్తు ఫారాలతో పాటు రుసుము వసూలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
‘బీజేపీ పట్టించుకోవడం లేదు’
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని వాసుల బాధలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. నగరంలోని చావ్రీ బజార్లో సోమవారం నిర్వహించిన జనజాగృతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీవాసుల సంక్షేమానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ)ఎన్నికల సమయంలో అధికార యం త్రాంగాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేసిందన్నారు. అందువల్లనే ఆ ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయం సాధించగలిగిందన్నారు. తమ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ తరఫున బరిలోకి దిగిన వ్యక్తి కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓడిపోయాడని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బీజేపీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. తద్వారా సమాజంలోని అన్నివర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని విమర్శించారు. అనంతరం డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ బీజేపీ మతవిద్వేష ప్రకటనల విషయంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. తమ పార్టీని కుదేలు చేసేందుకు ఆ రెండు పార్టీలు పరోక్షంగా చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు. -
60 మంది కాంగ్రెస్ నేతలపై కేసులు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ నివాసం ముందు ఆందోళనకు దిగిన 60 మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెంచిన రైల్వే చార్జీలను వెంటనే తగ్గించాలని, రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలో మంగళవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. త్యాగరాజ్ మార్గ్‌లోని గౌడ నివాసం ముందు చేపట్టిన ఈ ఆందోళనకు ఎటువంటి అనుమతి లేదని కమిషనర్ జతిన్ నర్వాల్ తెలిపారు. లవ్లీతోపాటు పార్టీ నేత ముఖేశ్ శర్మ తదితర 60 మంది నేతలపై కేసులు నమోదు చేశామని, చత్తర్‌సింగ్ అనే కార్యకర్తను కూడా అరెస్టు చేశామన్నారు. ప్రజాసేవకుల పట్ల అవిధేయతగా వ్యవహరించినందుకాగాను భారత శిక్షాస్మృతి, సెక్షన్ 188, విధులను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు 341, విధుల నుంచి వైదొలిగేలా ఒత్తిడి తెచ్చినందుకు 353 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆందోళన అరగంటపాటు కొనసాగిందని, ఆ వెంటనే నలుగురిని అరెస్టు చేసి, విడుదల చేశామని చెప్పారు.మంగళవారం జరిగిన ఈ ఆందోళన సమయంలో కొందరు కార్యకర్తలు గౌడ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న నేమ్ ప్లేట్‌ను తొలగించి, కిందపడేసి కాళ్లతో తొక్కారు. ఈ దృశ్యాలను మీడియా పదే పదే ప్రసారం చేసింది. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
బాధ్యత ఎన్డీయేదే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సంక్షోభానికి షీలా ప్రభుత్వమే కారణమంటూ కేంద్రమంత్రి పీయుష్ విమర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ.. కేంద్ర ప్రభుత్వ పాలన కింద ఉన్నందువల్ల ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీయేదేనని డీపీసీసీ అధ్యక్షుడు అర్వింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. షీలా ప్రభుత్వం నగరవాసులకు 24 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పీయుష్ తన బాధ్యతలనుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ రంగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిందన్నారు. ఆ రంగంలో సంస్కరణలు కూడా తెచ్చామన్నారు. సమస్యను పరిష్కరించే సంగతిని గాలికొదిలేసి కేంద్ర మంత్రి ఎదురుదాడికి దిగుతున్నాడని విమర్శించారు. ‘ఆప్’ చేసిందేమీ లేదు.. నగరం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆప్ ప్రభుత్వం కూడా ఒక కారణమన్నారు. వేసవి ప్రణాళికను ఎందుకు రూపొందించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ సమస్యను పరిష్కరించగలిగామని, అయితే ఆప్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. బాధ్యతారాహిత్యం: కేజ్రీవాల్ విద్యుత్ సంక్షోభం విషయంలో బీజేపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించలేకపోతోందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోందని, ఎన్నికలకు అనుమతించడం లేదని అన్నారు. -
అంతరాయం లేకుండా చూడండి
న్యూఢిల్లీ: పెనుదుమారం ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటి కొరత, విద్యుత్ సరఫరాలో కోత సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ బృందం ఎల్జీకి తెలియజేసింది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఎల్జీతో సమావేశం అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ నగరానికి విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదని, నగరానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న సంస్థలను ఈ విషయమై నిలదీయాలని కోరినట్టు చెప్పారు. ఒకవేళ ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోయినట్టయితే వాటిపై తప్పనిసరిగా చర్యలకు ఉపక్రమించాల్సిందిగా కోరామని చెప్పారు. ఈ విషయమై ఆయా డిస్కంలతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైతే వీధుల్లోకి వస్తామన్నారు. పెనుగాలి దుమారం తర్వాత నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర నీటికొరత, విద్యుత్ కోత సమస్య తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఎల్జీని కోరామన్నారు. అనంతరం డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే నీటి చార్జీలను 50 శాతం త గ్గిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను పెడతారి పట్టిస్తోందన్నారు. నెలసరి 400 యూనిట్ల కంటే ఎక్కువ వాడని వారికే ఆప్ సబ్సిడీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నగరవాసుల సమస్యలపై మాట్లాడుతూ ఒకవేళ విద్యుత్, నీటి సరఫరా నగరంలో ఇంకా మెరుగుపడకపోతే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని ఆయన హెచ్చరించారు. -
ఓటమి బాధ్యత వారిదే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన వద్ద ఓ వ్యూహం ఉందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు ఘోర పరాజయం పాలవడానికి కపిల్ సిబల్, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్‌లతోపాటు ఇతర ఎంపీలే కారణమని అన్నారు. అంతేతప్ప ఇందుకు పార్టీ కేంద్ర అధిషా ్టనం తప్పు ఎంతమాత్రం లేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కొంతమంది రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆయన పై విధంగా స్పందించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకూ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి ఓటమిపాలైన ఏడుగురు పార్టీ అభ్యర్థులే బాధ్యత వహించాలన్నారు. ఈ ఓటమికి ఎవరైన బాధ్యులు ఉన్నారంటే మాజీ ఎంపీలేనని, వారితోపాటు తాను కూడా అందులో ఒకరినన్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులంతా మూడోస్థానానికే పరిమితమైన సంగతి విదితమే. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యమిస్తానని అర్వీందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పార్టీకి కొత్తరూపం తీసుకొస్తానన్నారు. ‘అజయ్ మాకెన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సైతం నిర్వర్తించారు. బరిలోకి దిగినచోటే ఆయన ఓడిపోయారంటే అందుకు అధిష్టానం ఏవిధంగా బాధ్యత వహిస్తుంది’ అని ప్రశ్నించారు. పోరాటాలకు సన్నద్ధం ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. శుక్రవారం తుపాను బీభత్సం తరువాత మూడురోజుల నుంచి ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, మరోవైపు నీటి ఎద్దడిపై దృష్టి సారించిన కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధమవుతోంది. నజఫ్‌గఢ్, రోహిణి, ఉత్తమన్నగర్లతోపాటు ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి మూడు నుంచి ఐదు గంటలపాటు వరుసగా విద్యుత్ కోత ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా నీటి, విద్యుత్ సరఫరాను చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నగరంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. డీపీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ అధ్యక్షతన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, దీనికితోడు శుక్రవారం తుపాను నగరానికి 35 గంటలపాటు విద్యుత్ లేకుండా చేసిందని ఆయన అన్నారు. అయితే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ అదికారులు చెబుతున్నారని ముఖేష్ తెలిపారు. -
ఓటమికి భయపడేది లేదు
న్యూఢిల్లీ: ‘ఒకటి రెండు సార్లు ఓడిపోయినంత మాత్రాన మేం యుద్ధభూమిని వదిలి పారిపోయే రకం కాదు.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం..’ అని ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ వ్యాఖ్యానించారు. 15 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత విధాన సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, గాయాలను పట్టించుకోబోమని లవ్లీ అన్నారు. పార్టీ పునరుత్థానికి ప్రణాళిక రచించామన్నారు. ఒకటి, రెండుసార్లు ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు. తమ ప్రత్యర్థులైన భారతీయ జనతాపార్టీ(బీజేపీ), ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) లు మంచి పరిపాలన అందించలేవని రుజువైపోయిందన్నారు. 49 రోజుల పాలనకే ఆప్ ఢిల్లీ ప్రభుత్వం పగ్గాలను వది లేసి పారిపోయిందని విమర్శించారు. బీజేపీ సైతం నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో విఫలమైందని ఆరోపించారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత గత విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఎనిమిదింటిని మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న లవ్లీ మీడియాతో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘గతంలో అయిన గాయం నుంచి పార్టీ త్వరగానే కోలుకుంటోంది. మేం వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతం గా పర్యటించి కాంగ్రెస్ పార్టీ గతంలో సాధిం చిన విజయాలను వివరిస్తాం. గత ఎన్నికల్లో అనూ హ్య విజయం సాధించిన తన 49 రోజుల పాలన, మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీపాలనలోని లోటుపాట్లు, వైఫల్యాలను ఎండగడతామని వివరించా రు. నగరంలోని ఏడు లోక్‌సభ సీట్లూ తమవేనని బీజేపీ, ఆప్ ప్రకటించుకుంటున్న తీరుపై ఆయన స్పందిస్తూ..‘ అలా ప్రచారం చేసుకోవడం వాటి అజ్ఞానానికి నిదర్శనం. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ మీడియా సృష్టించినవారే.. వారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతమాత్రం ఉండదు. మీడియా మాత్రం గోరింతలను కొండింతలు చేసి చూపిస్తోంద’న్నారు. ‘మేం బయటనుంచి మద్దతు ఇచ్చినా సర్కారును నడపడంలో ఆప్ విఫలమైంది. మళ్లీ వారికి అధికారం ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు..’ అని విమర్శించారు. బీజేపీ పరిస్థితి కూడా దీనికి భిన్నం కాదని ఆయన విశ్లేషించారు. ‘ఆప్ హామీలు చూసి గత ఎన్నికల్లో ప్రజలు వారికి అవకాశమిచ్చా రు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది కాబట్టే ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు బయటనుంచి మద్దతు ఇచ్చి ప్రోత్సహించాం. అయితే ఈ అవకాశాన్ని ఆప్ వినియోగించుకోలేకపోయింది. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనేలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఒక ప్రభుత్వం తన ఇష్టానుసారం నడుచుకుంటానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా..’ అని అన్నారు. ‘కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల రిఫరెం డం అడిగిన వ్యక్తి ప్రభుత్వాన్ని వీడినప్పుడు మరి ఆ ప్రజల తీర్పును ఎందుకు అడగలేదు..?’ అని లవ్లీ సింగ్ ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషిచేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
ఢిల్లీని అధికారులకు వదిలేశాడు
అరవింద్‌పై లవ్లీ ఆరోపణాస్త్రాలు రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇదంతా హామీల్ని నెరవేర్చకుండానేఅధికారం నుంచి వైదొలిగారు ఇలా చేయడం ప్రజల్ని వంచడమే 23న కేజ్రీవాల్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తాం న్యూఢిల్లీ: తన రాజకీయ స్వప్రయోజనాల కోసం అరవింద్ కేజ్రీవాల్...ఢిల్లీని అధికారులకు వదిలేశాడని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన హామీలన్నీ అలానే పడిఉన్నాయన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, అనధికార కాలనీలను క్రమబద్ధీకరణ తదితర అనేక హామీలు ఎన్నికల సమయంలో ఆప్ ఇచ్చింది. అయితే తన వాగ్దానాలను పూర్తిచేయకుండానే ఆ పార్టీ పారిపోయింది. ఈవిధంగా చేయడం ప్రజలను వంచించడమే.’ అని విమర్శించారు. ‘పోల్ ఖోల్’ పేరిట త మ పార్టీ ఈ నెల 23వ తేదీన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపడుతుందంటూ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించాడని, కేవలం తన రాజకీయ స్వప్రయోజనాలను సాధించుకునేందుకు జాతీయ రాజధాని నగరాన్ని ఉన్నతాధికారుల దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టాడని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఢిల్లీ శాఖ కూడా త్వరలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని అర్విందర్‌సింగ్ లవ్లీ స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఈ నెల 23వ తేదీన స్థానిక సెంట్రల్ పార్కు వద్ద సమావేశమవుతారని, అక్కడ 20 అడుగుల కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారని చెప్పారు. తదుపరి ఎన్నికల్లో లబ్ధి పొందేదిశగా కేజ్రీవాల్ ముందుకు సాగుతున్నాడని, నగరంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజల ఈతిబాధలను మరింతపెంచేవిగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. -
ఆప్.. అనధికార కాలనీల శత్రువు
న్యూఢిల్లీ: అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీలో జరిగిన అవకతవకలకు బాధ్యురాలైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆప్.. రాష్ట్రపతికి సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. అనధికార కాలనీలను షీలా దీక్షిత్ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మంగళవారం ప్రకటించారు. ‘కాలనీలను క్రమబద్ధీకరించడమే కాదు.. అక్కడ భారీగా అభివృద్ధి పనులు కూడా చేపట్టాం. క్రమబద్ధీకరించకుంటే అక్కడ అభివృద్ధి జరిగేదే కాదు. మురికివాడల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యతిరేకం. ఒకవేళ షీలా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పనిచేసుంటే.. ఇప్పుడు కేజ్రీవాల్ చర్యలు కూడా అందుకు విరుద్ధంగా ఏమీ లేవు. ఆయన కూడా రాజకీయ ప్రయోజనాలనే ఆశిస్తున్నారు’ అని విమర్శించారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి లేఖ రాయడమే దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా కేజ్రీవాల్ పేదవారిని అవమానించారని, ఆయన వాళ్లకు శత్రువని లవ్లీ ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లును రాజ్యాంగ విరుద్ధ పద్ధతుల్లో ఆమోదించడం కూడా రాజకీయ నాటకమని లవ్లీ విమర్శించారు. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీపై అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ లోకాయుక్త మన్మోహన్ సరీన్ షీలా అక్రమాలకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆమె ఈ పనిచేశారని గత ఏడాది నవంబర్‌లో ఆయన స్పష్టం చేశారు. పత్రాల జారీకి సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను కూడా 2008లో అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం పాటించలేదని, ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ఆప్ సర్కారును ఆదేశించారు. దీనిపై స్పందించిన ఆప్ ప్రభుత్వం షీలా దీక్షిత్‌పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరింది. కాలనీల క్రమబద్ధీకరణలో అక్రమాలపై బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ లోకాయుక్తకు 2010లో ఫిర్యాదు చేశారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేసిందని ఆరోపించారు. నగరంలోని 1,639 అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. 2008 ముందు వాటికి తాత్కాలిక క్రమబద్ధీకరణ పత్రాలను (ప్రొవిజినల్ సర్టిఫికెట్స్) పంపిణీ చేసింది. -
చట్టప్రకారం చర్యలకు కాంగ్రెస్ డిమాండ్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను కలిశారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని బృందం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి..సోమ్‌నాథ్ భారతి వ్యవహారంలో జోక్యం కలిగించుకొని చట్టప్రకారం చర్యలు చేపట్టవలసిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని, ఈ కేసులో చట్టప్రకారం దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని తాము లెప్టినెంట్ గవర్నర్‌ను కోరామని లవ్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రి చట్టానికి అతీతుడు కాడని, ఆయనపై తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తాము కోరామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తానని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తమకు హామీ ఇచ్చారని సమావేశం తరువాత విలేఖరులతో మాట్లాడిన లవ్లీ చెప్పారు. తాము ఆప్ ప్రభుత్వానికి 18 అంశాలపై మద్దతు ఇస్తున్నామని, వారు ఈ అంశాలలో దేని నుంచైనా పక్కకు తప్పుకున్నట్లయితే తమ మద్దతును ఉపసంహరించడం గురించి ఆలోచిస్తామని లవ్లీ హెచ్చరించారు. సోమ్‌నాథ్ భారతీని మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఈ కేసులో చట్టప్రకారం వ్యవహరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని మాత్రమే తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరామ’ని చెప్పారు. -
అతనెవరో చెప్పండి: లవ్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య ఏ పారిశ్రామికవేత్త ఒప్పందం కుదిర్చాడో వెల్లడించాలని బీజేపీ నేత నితిన్ గడ్కారీని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు ఆరోపణ చేసే ముందు, అది తప్పా? ఒప్పా? అన్నది ఒకటికీ రెండుసార్లు సరిచూసుకోవాలని గడ్కారీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ పారిశ్రామికవేత్త ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ ఏర్పాటును ఆపేందుకు ఓ పారిశ్రామికవేత్త రంగంలోకి దిగి కాం గ్రెస్, ఆప్‌ల మధ్య ఒప్పందం కుదిర్చాడని ఇటీవల గడ్కారీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సాక్ష్యాధారాలతో ముందుకు రావాలని గడ్కారీకి ఆప్ సవాల్ విసిరింది. సరైన సమయంలో వెల్లడిస్తా: గడ్కారీ ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఒప్పందాన్ని కుదర్చిన పారిశ్రామికవేత్త పేరును సరైన సమయంలో వెల్లడిస్తానని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెలిపారు. తగిన సమయంలో ఆ రహస్యాన్ని వెల్లడిస్తానని, దానికిది సరైన సమయం కాదని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో ఢిల్లీ ప్రజలకు తెలుసని చెప్పారు. అయితే కాంగ్రెస్, ఆప్‌ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో గడ్కారీ ఎట్టకేలకు నోరు విప్పి పైవిధంగా సమాధానమిచ్చారు. -
డీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన లవ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీమంత్రి, గాంధీనగర్ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ ఇన్చార్జి పదవికి జయప్రకాశ్ అగర్వాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యువతకు పెద్ద పీట వేయడంతో నగర పరిధిలో పార్టీని గాడిలోపెట్టే బాధ్యతను షీలాదీక్షిత్ సన్నిహితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించాలని నిర్ణయించారు. దీంతో స్థానిక డీడీయూ మార్గ్‌లోని రాజీవ్ భవన్ డీపీసీసీ కార్యాలయంలో లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అర్విందర్‌సింగ్ లవ్లీ అతి పిన్న వయస్సులోనే డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లవ్లీ ప్రసంగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గౌరవం తగ్గకుండా పనిచేస్తానన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేదాకా ఉద్యమిస్తానన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందన్నారు. యువనేత, కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావి ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ విధానసభలోపలా, వెలుపలా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. ముభావంగా షీలాదీక్షిత్ ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎంతో నిరాశగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరై పాల్గొంటున్నా మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని ఆదివారం డీపీసీసీ కార్యాలయంలో కార్యక్రమానికి వచ్చిన పలువురు కార్యకర్తలు చర్చించుకున్నారు. పదవి పోయినప్పటి నుంచి షీలాదీక్షిత్ మీడియా మందుకు సైతం అంతగా రావడం లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో షీలా నిరాశగా కనిపించారు. -
వేధింపులకు పాల్పడితే సహించం
న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగిన ఏ పారీకీ అనుకున్న రీతిలో మెజారిటీ రాకపోవడంతోజాతీయ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంలో పడిపోయింది. చివరకు రెండవ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ బాహ్య మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే బాహ్య మద్దతుదారు అయిన కాంగ్రెస్ పార్టీ ముందస్తు హెచ్చరికలు కూడా మొదలు పెట్టడంతో ప్రభుత్వ మనుగడ ఎన్నాళ్లనేది? రాజనీతిజ్ఞులనే వేధిస్తున్న ప్రశ్నగా నిలిచింది. గడచిన 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ పేరిట కేజ్రీవాల్ వేధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ లవ్లీ మీడియాతో స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం ప్రతి ముఖ్యమంత్రి కర్తవ్యమని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో లవ్లీ ఈ ప్రకటన చేశారు. ‘అధికార పీఠంపై అధిష్టించే ముందు చేసే ప్రతిజ్ఞలోనే అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రజలకు భరోసా ఇచ్చినట్లు. ఇది ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలో రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అని లవ్లీ అన్నారు. ఆప్ పార్టీకి మద్దతు విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ‘తమ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌లు డిసెంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు రాసిన లేఖలో ఆమ్ఆద్మీ పార్టీకి తాము వెలుపలి నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు.ఇందులో కాంగ్రెస్‌కు పునరాలోచన అనేది లేదు. పార్టీ శాసనసభా పక్షం సమావేశం తర్వాత మాత్రమే శాసనసభలో ఎలా వ్యవహరించాలనే విషయంపై తమ పార్టీ వ్యూహం ఖరారు చేసుకుంటాం’ అని లవ్లీ వివరించారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేజ్రీవాల్ రాసిన లేఖలో 18 అంశాలపై వైఖరి వెల్లడించాలని కోరిన విషయం ఏమిటని ప్రశ్నించగా ఈ 18 అంశాల్లో అత్యధికం అమలుకు సంబంధించిన నిర్ణయాలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటిని అనుసరించవచ్చు అని సమాధానమిచ్చారు. -
హస్తిన హస్తానికి మరమ్మతులు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తినలో పదిహేనేళ్లుగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవడంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యం లో పార్టీకి మరమ్మతులు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేయడంతోపాటు కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సీనియర్ నాయకులను పక్కన పెట్టి 46 ఏళ్ల అర్విందర్‌సింగ్ లవ్లీకి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిద్వారా ఢిల్లీలో పార్టీకి యువరక్తం ఎక్కించనున్నట్టు సంకేతాలు పంపింది. పార్టీలో ఏళ్లుగా పాతుకుపోయిన నాయకులపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణంగా అధిష్టానం భావిస్తోందని కొందరు నాయకులు పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో షీలాసర్కార్ 15ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలే కపోయామని రాహూల్ గాంధీ స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిపారు. డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న జైప్రకాశ్ అగర్వాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ మధ్య అంతరాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టు సమచారం. కొత్తగా డీపీసీసీ పగ్గాలు చేపట్టిన అర్విందర్‌సింగ్ లవ్లీకి షీలాదీక్షిత్‌కి సాన్నిహిత్యం ఉండడంతో ఇకపై ఎలాంటి విభేదాలు ఉండబోవన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. యువతకు చేరువయ్యేందుకే... ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా ఉన్న యువతకు చేరువ కాలేకపోవడమూ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీంతో యువతకు ప్రాధాన్యం పెంచితే కొత్త ఉత్సాహాన్ని పార్టీలో నింపవచ్చన్నది వారి భావన. 1987 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న అర్విందర్‌సింగ్ లవ్లీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ నాయకులతో లవ్లీకి ఉన్న సాన్నిహిత్యం అంతర్గత విభేదాలు తొలగించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే వీలైనంత మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ షీలాదీక్షిత్‌పై ఉన్న నమ్మకంతో ఆమె సలహా మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఎక్కువ స్థానాల్లో పోటీకి దింపారు. సరిగ్గా అదే వ్యూహం బెడిసికొట్టడంతో పార్టీ నాయకత్వం మరోమారు ఆలోచనలో పడింది. కత్తిమీద సామే... పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితుల్లో డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అర్విందర్‌సింగ్ లవ్లీ ఎంతో నేర్పుగా వ్యవహరించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నిక లకు గడువు చాలా తక్కువగా ఉండడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడం అంతసులువైన పనేంకాదు. ఇన్నాళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లో, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఆ ప్రాంతాలను తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడం అంత సులువేం కాదు. ఇన్నాళ్లు అధికార మంత్ర దండంతో ప్రజలను ఆకర్షించినట్టు చేసేం దుకు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం లేదు. వీట న్నింటి నడుమ పార్టీ పూర్వవైభవం తేవడంలో లవ్లీ ఏమేరకు సఫలమవుతారో మరికొద్ది నెలల్లో తేల నుంది. మరోవైపు పార్టీ అధిష్టాన వర్గం తనపై ఉంచిన అంచనాలు అందుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని అర్విందర్‌సింగ్ లవ్లీ వ్యక్తం చేస్తున్నారు.