కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న అరవిందర్ సింగ్ లవ్‌లీ
సాక్షి, న్యూఢిల్లీ : గతంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవలీ తిరిగి సొంత పార్టీ గూటికి చేరారు. దాదాపు తొమ్మిది నెలల కిందట బీజేపీలో చేరేందుకు వెళ్లిన ఆయన తిరిగి బీజేపీతో తనకు సరిపడదని పేర్కొంటూ కాంగ్రెస్ లోకే వచ్చారు. 'సిద్ధాంతాలపరంగా నాకు బీజేపీకి సరిపడదు. నా కుటుంబ పార్టీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది' అని లవ్‌లీ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు చెప్పారు. కాగా లవలీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని ఢిల్లీ ఏఐసీసీ ఇంచార్జ్ పీసీ చాకో, మాకెన్ స్వాగతించారు.
గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన షీలా దీక్షిత్‌కు అరవిందర్ సింగ్ చాలా సన్నిహితుడని పేరుంది. ఆమె ప్రభుత్వంలో పలు బాధ్యతలను అతడు నిర్వహించాడు. నాలుగుసార్లు ఇప్పటికే ఢిల్లీ ఎమ్మెల్యేగా పనిచేసిన అరవింద్ తొలిసారి 1998లో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అరవింద్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం వెనుక రాహుల్‌గాంధీ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment