New York City
-
భర్తకు కన్నీటి నివాళి : బోరున విలపించిన ఇన్‌ప్లూయెన్సర్ సృజన సుబేది
క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన నేపాల్‌కు చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ బిబేక్ పంగేని అంత్యక్రియలు న్యూయార్క్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అతని భార్య సృజన సుబేది బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. ధైర్యంగా ఉండు మిత్రమా అంటూ నెటిజన్లు సృజనకు ధైర్యం చెబుతున్నారు.2022లో పంగేని క్యాన్సర్‌ను గుర్తిచారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సృజన కంటిరెప్పలా కాపాడుకుంది. అన్నివేళలా అతనికి తోడుగా ఉంటూ, ధైర్యం చెబుతూ కన్నతల్లి కంటే మిన్నగా సేవలందించింది. చివరికి ఆమె ప్రేమ ఓడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో పీహెచ్డీ విద్యార్థి అయిన బిబెక్ పంగేని సుదీర్ఘ పోరాటం తర్వాత (డిసెంబరు19న) తనువు చాలించారు.Last Farewell Of Bibek Pangeni In New York. #bibekpangeni #sirjanasubedi pic.twitter.com/Wzpjdff1cP— Neha Gurung (@nehaGurung1692) December 22, 2024మూడో దశ గ్లియోమాతో పోరాడుతున్న భర్త చికిత్సకు చికిత్స సమయంలో ధైర్యంగా నిలబడింది.ఎ లాగైన తన భర్తను కాపాడుకోవాలని తాపత్రయప పడింది. తన మొత్తం సమయాన్ని వెచ్చించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసేది. తాను ధైర్యంగా ఉండటమే కాదు భర్తకు ప్రేమను పంచుతూ తనలాంటి వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. సోషల్‌మీడియాలో వీరి రీల్స్, వీడియోలు నెటిజనుల హృదయాలను కూడా కదిలించేవి. అతను తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఎవరి ప్రార్థనలు ఫలించలేదు. -
ఒక సొరంగం.. రూ.16.96 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం. ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు. -
డ్రోన్లా..? విమానాలా..? యూఎఫ్‌వోలా?
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీర రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా రాత్రి వేళల్లో ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తుండటం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. అవి శత్రు దేశాల నిఘా డ్రోన్లా, ఫ్లయింగ్ సాసర్లా, లేక మామూలు విమానాలా అన్నది ఓ పట్టాన తేలడం లేదు. దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దాంతో రాత్రయితే చాలు జనం ఆకాశం వంక ఆసక్తిగా పరికించి చూస్తున్నారు. తాజాగా న్యూజెర్సీ మీదుగా ఆకాశంలో కనిపిస్తున్న గుర్తు తెలియని వస్తువులపై స్థానిక సోషల్ మీడియాలో చిలువలు పలవలుగా కథనాలు వెలువడుతున్నాయి. వీటి వెనుక వాస్తవాలను ప్రభుత్వం తక్షణం ప్రజల ముందుంచాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసేదాకా వెళ్లింది! న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అయితే అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ మేరకు లేఖ కూడా రాశారు. గురువారం రాత్రి న్యూజెర్సీ శివారులో కనిపించిన డ్రోన్‌ను వెంటాడినట్లు సెనేటర్ ఆండీ కిమ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. మోరిస్ కౌంటీలోని ఓ ఇంటి ఆవరణలో గురువారం రాత్రి బుల్లి డ్రోన్ కూలడం మరింత కలకలం రేపింది. అది ది బొమ్మ డ్రోనేనని అధికారులు తేల్చారు. This is not a drone. We have a full blown UFO / UAP event occurring in real time in New Jersey with tens of thousands of witnesses and tons of video footage. pic.twitter.com/jPRy6pT6Rl— DivXMaN (@crypto_div) December 11, 2024ఇవీ వదంతులు.. గుర్తు తెలియని వస్తువులపై రకరకాల కథనాలు హల్చల్ చేస్తున్నాయి. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూజెర్సీ రాష్ట్రంలోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఉన్న ఆస్తులను కాపాడేందుకే ఈ డ్రోన్లను ప్రయోగించి ఉంటారని కొందరు, నిఘా కోసం ఇరాన్, లేదా చైనా పంపి ఉంటాయని మరికొందరు అంటున్నారు. దీనిపై చర్చకు సోషల్ మీడియాలో గ్రూపులే ఏర్పాటయ్యాయి! ఫేస్బుక్లో న్యూజెర్సీ మిస్టరీ డ్రోన్స్ పేరుతో పేజీ పుట్టుకొచ్చింది. అందులో సభ్యుల సంఖ్య శనివారానికి 44 వేలకు చేరింది! డ్రోన్లు, ఇతర వస్తువుల ఫొటోలను అందులో పోస్ట్ చేస్తున్నారు. కామెంట్ల వరద కొనసాగుతోంది. డ్రోన్లు కనిపిస్తే పిట్టల్ని కాలి్చనట్లు కాల్చి పారేయాలని కొందరు సలహాలిస్తున్నారు. జనం క్రిస్మస్ షాపింగ్ తదితరాలను కూడా మానేసి మరీ ఇంటిల్లిపాదీ వాటినే చూస్తూ కాలక్షేపం చేస్తున్నారట! చిన్న విమానాలే: వైట్‌హౌస్ ఆకాశంలో ఎగురుతూ కనిపించే డ్రోన్లతో జాతీయ భద్రతకు, ప్రజలకు ముప్పేమీ లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అవేమిటో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలుస్తున్నాం. వాటిలో చాలావరకు చిన్న విమానాలే. ఇతర దేశాల నుంచి వచి్చనవి కావు. నిషేధిత ప్రాంతాల మీదుగా ఎగరడం లేదు’’ అని తెలిపింది. కానీ జనం మాత్రం దీన్ని నమ్మడం లేదు.How are dozens of SUV-sized drones flying over New Jersey on a nightly basis and nobody in our government knows where they’re coming from or what they’re doing?FBI, Congress, local officials - all baffled.And no one is even talking about it?WHAT?!pic.twitter.com/7ldNDqF94Y— The Kevin Harlan Effect (@KevHarlanEffect) December 11, 2024 కూల్చేయండి: ట్రంప్మిస్టరీ డ్రోన్లను కనిపించిన వెంటనే కూల్చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇవన్నీ యథేచ్ఛగా సంచరిస్తున్నాయా అంటూ సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ప్రశ్నించారు. ‘అవేంటో ప్రజలకు చెప్పండి. లేదా కూల్చేయండి’ అని అధికారులను కోరారు.Uap in Fairfield, New Jersey. According to the witness, no fixed wing and no sound.recorded by Lori Jones. 12/12/24#uap #ufo #njdrone #nj #drones pic.twitter.com/gxVHFoc9Md— Jason (@protestroots) December 13, 2024 UFO SPOTTED OVER NEW JERSEY..You got to be kidding me. NOPE " pic.twitter.com/HPqjAorZST— 🔨Robert The Builder 🇺🇸 (@NobodymrRobert) December 12, 2024 -
‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి
ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. -
పాక్ హోటల్‌కు రూ.1,860 కోట్ల చెల్లింపు.. అమెరికా ప్రభుత్వంపై వివేక్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో పాకిస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో ఓ 19 అంతస్తుల హోటల్ ఉంది. ఆ హోటల్‌కు అమెరికా ప్రభుత్వం అద్దె రూపంలో ఏకంగా 220 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలస దారులు మన దేశంలో విడిది చేసేందుకు.. మనమే వాళ్లకి వసతి కల్పిస్తున్నాం. అందుకు డబ్బులు కూడా మనమే చెల్లిస్తున్నాం. ఇది ఆమోద యోగ్యం కాదని అన్నారు.ప్రస్తుతం, న్యూయార్క్ నగరం మాన్హాటన్లో పాక్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్ గురించి రచయిత జాన్ లెఫెవ్రే ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.A taxpayer-funded hotel for illegal migrants is owned by the Pakistani government which means NYC taxpayers are effectively paying a foreign government to house illegals in our own country. This is nuts. https://t.co/Oy4Z9qoX45— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 1, 2024 ఆ పోస్ట్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్‌కు న్యూయార్క్ నగర పాలక సంస్థ అద్దె రూపంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి 220 మిలియన్లు (రూ.1860.40 కోట్లు) చెల్లిస్తోంది. ఉదాహరణకు.. న్యూయార్క్‌కు వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పాకిస్థాన్ పౌరులు న్యూయార్క్‌కు వస్తుంటారు. వచ్చిన వాళ్లు వీసా,జాబ్ రకరకలా సమస్యల వల్ల అక్కడే ఉండాల్సి ఉంది..ఇమ్మిగ్రేషన్ సమస్య ఉంటే అమెరికా వదిలి వారి సొంత దేశం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు వీలు లేదు.మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారు.ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మాన్హాటన్లో పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిలైన్స్‌కు చెందిన రూజ్వెల్ట్ హోటల్‌ను అమెరికా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఆ హోటల్లో వసతి కల్పిస్తుంది. హోటల్‌ను అద్దెకు తీసుకున్నందుకు రూ.1860.40 కోట్లు చెల్లిస్తుంది.ఈ అంశంపై వివేక్ రామస్వామి స్పందిస్తూ.. ‘మన దేశ ట్యాక్స్ పేయర్లు అక్రమ వలస దారులు బస చేసేందుకు హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌కూ అద్దె చెల్లించడం విడ్డూరంగా ఉంది’ అని పేర్కొన్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూస్వెల్ట్ పేరుతో ఉన్న ఈ 19 అంతస్తుల భవనంలో మొత్తం 1200 గదులున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి కేంద్రంగా మారుతోందని రచయిత జాన్ లెఫెవ్రే ఆందోళన వ్యక్తం చేశారు. -
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్‌లో నిలిచింది.శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం...
-
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్‌కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది. 🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది. History has been Scripted !!!For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. View this post on Instagram A post shared by RUCHIKA JAIN FIREFLYDO (@fireflydo) (చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
రెండు మ్యాప్‌లతో ఐరాస వేదికపై నెతన్యాహు.. భారత్ ఎటువైపు అంటే
హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ.. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తన చేతుల్లో రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.ఇక ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా కనిపిస్తున్న ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు తెలిపారు. లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిజ్బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం.. వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారునెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. -
హెజ్బొల్లాపై యుద్ధం ఆగదు
ఐక్యరాజ్యసమితి: ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవి్వంపు దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై తమ వైమానిక దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సాక్షిగా సమరి్థంచుకున్నారు. హెజ్బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని, విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. న్యూయార్క్ నగరంలో ఐరాస సర్వ సభ్య సమావేశాల సందర్భంగా శుక్రవారం నెతన్యాహూ ప్రసంగించారు. హెజ్బొల్లాపై దాడులు ఆపబోమని చెప్పి అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పులవిరమణ ప్రతిపాదనలకు నెతన్యాహూ పురిట్లోనే సంధికొట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని.. రోజూ రాకెట్ దాడులను సహించం ‘‘పొంచిఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్‌పై ఉంది. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్ పాసో, శాండిగోలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది?. మేం కూడా అంతే. దాదాపు ఏడాదికాలంగా హెజ్బొల్లా దాడులను భరిస్తున్నాం. మాలో సహనం నశించింది. ఇక చాలు. సొంతిళ్లను వదిలి వెళ్లిన 60,000 మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలను సొంతిళ్లకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దు వెంట ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. మా లక్ష్యం నెరవేరేదాకా హెజ్బొల్లాపై దాడులను ఆపేది లేదు’’ అని నెతన్యాçహూ అన్నారు. అందుకే వచ్చా ‘‘నిజానికి ఈ ఏడాది ఐరాసలో మాట్లాడేందుకు రావొద్దనుకున్నా. అస్థిత్వం కోసం గాజా్రస్టిప్‌పై సైనిక చర్య మొదలయ్యాక నా దేశం యుద్ధంలో మునిగిపోయింది. అయితే ఐరాస పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు, వదంతులకు చరమగీతం పాడేందుకే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటుంది. ఒక్కటి స్పష్టంగా చెబుతున్నా. మాపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై దాడి చేస్తాం. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణం’’ అని అన్నారు. 90% హమాస్ రాకెట్లు ధ్వంసంచేశాం‘‘గాజాలో యుద్ధం తుది దశకు వచి్చంది. ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉంది. ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలి. లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధంచేస్తాం. సంపూర్ణ విజయమే మా లక్ష్యం. దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధబాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక మాకు కూడా ఇంకో మార్గం లేకుండాపోయింది. 90 % హమాస్ రాకెట్లను ధ్వంసంచేశాం. 40వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమో లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగింది అని అన్నారు.ఓవైపు ఆశీస్సులు... మరోవైపు శాపంఆశీస్సులు, శాపం అనే పేర్లు పెట్టి రెండు భిన్న ప్రాంతాల భౌగోళిక పటాలను నెతన్యాహూ పట్టుకొచ్చి వివరించారు. ‘‘ ఆశీస్సులు కావాలో, శాపం కావాలో ప్రపంచదేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్.. ఆసి యా, యూరప్‌ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోంది. ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయింది. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరాసముద్రం దాకా పరుచుకున్న ఉగ్రనీడ ఇది. ఇది ప్రపంచదేశాలకు శాపం. ఇరాన్లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమీ లేదు’’ అంటూ తప్పనిపరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్‌పైనా దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యాహూ తెచి్చన మ్యాప్‌లో గాజా్రస్టిప్ మొత్తాన్నీ ఇజ్రాయెల్‌లో భాగంగానే చూపారు. హమాస్, హెజ్బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహూ చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టంలేని చాలా మంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్‌డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్‌ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్‌ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్‌గేట్స్‌కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్‌కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్‌వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి
న్యూయార్క్: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై, సాధారణ ప్రజల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగిసిపోవాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై మూడు గంటలకుపైగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌లో సంక్షోభానికి త్వరగా తెరపడేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కటి పరిష్కార మార్గం కోసం అంకితభావంతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ విజ్ఞప్తితోనే మోదీ–జెలెన్స్కీ మధ్య ఈ సమావేశం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. జెలెన్స్కీతో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడమే లక్ష్యంగా గత నెలలో జరిగిన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారు.ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడి, శాంతి, స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు జరగాలని సూచించారు. తమ దేశ సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మేనియా ప్రధానితో భేటీ ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఆర్మేని యా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తో భేటీ అయ్యారు. భారత్– ఆర్మేనియా మధ్య సంబంధాలపై చర్చించారు. నికోల్తో అద్భుతమైన చర్చ జరిగిందని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సిక్కులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ న్యూయార్క్‌లో పలువురు సిక్కు పెద్దలతో సమావేశమయ్యారు. భారత్ లో సిక్కు సామాజిక వర్గం అభ్యున్నతికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారంటూ మోదీకి సిక్కులు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన మూడు రోజుల పర్యటన ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం న్యూయార్క్ నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పాటించాలి: మోదీపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడాలని, అన్ని పక్షాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతికి చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
ఎన్ఆర్ఐలే భారత్ అంబాసిడర్లు: ప్రధాని మోదీ
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. మూడు రోజులు పర్యటనలో భాగంగా అమెరికాలో మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్న మోదీ.. భారత్ అవకాశాల స్వరమని పేర్కొన్నారు. అలాగే, సుపరిపాలన, సుసంపన్న భారత్ సాధన కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చానని ప్రధాని తెలిపారు.న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘భారత్ అవకాశాలకు స్వర్గం వంటింది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు వీలుగా ఎన్నో నిర్మాణాత్మక పనులు చేపడుతున్నాం. అత్యంత సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చాం. ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. అబ్ కీ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం) వచ్చింది. భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యత ఉంది.నేను రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాను. గుజరాత్ ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. త్యాగాలు చేసే వారే ఫలాలను పొందుతారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను ఎంతో ముఖ్యమైనది.140 కోట్ల మందికి దక్కిన గౌరవంఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నన్ను శనివారం డెలావేర్ని తన నివాసానికి తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. మీ విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైంది. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు. భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములు కూడా అవుతున్నాయి. A ‘Made in India’ chip will become a reality and this is Modi’s Guarantee. pic.twitter.com/WkGW4RmSYS— Narendra Modi (@narendramodi) September 23, 2024 2036లో భారత్‌లో ఒలింపిక్స్..ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని నా నమ్మకం. మీరు భారత్, అమెరికాలను అనుసంధానం చేస్తున్నారు. మీ నైపుణ్యం, ప్రతిభ, నిబద్ధత అసమానం. భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది రక్తం, సంస్కృతిలోనే ఉంది. అలాగే, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పని చేస్తున్నాం. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో 5జీ, డిజిటల్ చెల్లింపులు సరికొత్త విప్లవాన్ని సృష్టించాయి. భారత్‌లో ఉన్న 5జీ నెట్వర్క్ అమెరికా కంటే పెద్దది. మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే రోజు ఎంతో దూరంలో లేదు అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Prime Minister Narendra Modi greets members of the Indian diaspora after addressing the gathering at Nassau Coliseum arena in New York, US. pic.twitter.com/7hTo6vdSDo— ANI (@ANI) September 22, 2024 ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 42 రాష్ట్రాల నుండి దాదాపు 15,000 మంది భారతీయ ప్రవాసులు ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయన సదస్సుకు వచ్చిన వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.#WATCH | In New York, PM Modi says, "...Only a few days ago, the Paris Olympics concluded. Very soon, you will witness the Olympics in India too. We are putting all possible efforts to host the 2036 Olympics." pic.twitter.com/oN9ml1Ngnl— ANI (@ANI) September 22, 2024 ఇది కూడా చదవండి: ట్రంప్ భద్రతలో వైఫల్యం -
సెప్టెంబర్‌లో అమెరికాకు మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ద్వీపంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16వేల సీటింగ్ సామర్థ్యమున్న నసావూ కొలీసియం ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 22వ తేదీన మోదీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్నారు. భారతీయ అమెరికన్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐరాసలో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం అమెరికా పర్యటనకు వెళ్లారు. పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా ఆయనతో వెళ్లినవారిలో ఉన్నారు. శనివారం ఉదయం 4.35గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి అమెరికన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆదివారం న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణవాసులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 11న అమెరికా నుంచి బయల్దేరి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకోనున్నారు. అక్కడ వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
న్యూయార్క్ లో కాల్పులు
-
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా నగరం న్యూయార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ పార్క్‌లో తుపాకుల మోత మోగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం రోచెస్టర్ ప్రాంతంలోని మాపెల్వుడ్ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చనిపోయింది ఒక మహిళగా తెలుస్తోంది. ఆరుగురికి బుల్లెట్ గాయాలుకాగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఒక్కడా? గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారా?.. తదితర వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.#UPDATE : Multiple people were shot at least one person is dead after a shootout occurred at Maplewood Park. Multiple police agencies have the area lockdown. #Rochester #NewYork #MassShooting #Shooting #USA #America #MaplewoodPark pic.twitter.com/ZwNcCW014W— upuknews (@upuknews1) July 29, 2024 -
షాకింగ్ వీడియో.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయా?
ఆకాశంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒక విమానం మరో విమానాన్ని ఢీకొట్టిందా? అన్నట్టుగా విమానాలు చేరువయ్యాయి. ల్యాండ్ అవుతున్న ఒక విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఢీకొట్టుకోబోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలై ఎనిమిదో తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకోబోయాయి. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో కంట్రోలర్లు మొదట అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బొంబార్డియర్ CRJ-700ను రన్‌వే 28లో ల్యాండ్ చేయడానికి క్లియర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో CRJ-700కి అదే రన్‌వే నుండి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.ఈ రెండు విమానాలు ఆకాశంలో ఒకానొక సమయంలో చాలా దగ్గరగా ఉన్నాయి. రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్ రాడార్-24 వెబ్సైట్ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700-1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో 75 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగకపోవడం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport. A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane. The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM— Collin Rugg (@CollinRugg) July 10, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటనపై సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ నుంచి విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలుగలేదన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఏఏ విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్‌లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్‌కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది.